పర్యాటకం

మహేంద్రగిరులు.. పాండవుల గుడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తున.. మహేంద్రగిరులపై శివనామస్మరణ హోరెత్తే రోజు వచ్చింది. వయోవృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ఎంతో భక్తితో ఆ గిరులను ఎక్కి ముక్కంటిని ఆర్తిగా భక్తితో తలచుకుంటారు. తూర్పు కనుమల్లో ముఖ్యమైన మహేంద్ర గిరులపై భారీ రాళ్లతో కట్టిన 3పాండవుల గుడులు2 ఎప్పటికీ ప్రత్యేక ఆకర్షణే. దట్టమైన అడవి, కొండకోనలు, వన్యప్రాణులు, శుకపికముల కువకువలు మనసును ఆహ్లాదపరుస్తూంటే మన కాళ్లకింద ఉన్నట్లు కన్పించే సముద్రతీరం, అందులోంచి బయటకు వచ్చే బంతిలాంటి లేలేత భానుడు ఆధ్యాత్మికతను పరిపుష్టం చేసే ప్రకృతి సోయగాలు మనసును ఎటో తీసుకువెళతాయి.
శ్రీకాకుళం జిల్లాలో..
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో సముద్ర మట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తున మహేంద్రగిరులున్నాయి. ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడి పరిథిలోకి వచ్చే ఈ ప్రాంతం ఆంధ్రలోని మండల కేంద్రమైన మందసకు 40 కిలోమీటర్ల దూరంలో, బారువా సముద్రతీరానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివరాత్రి సందర్భంగా ఈ గిరులను సందర్శించే భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అటు ఒడిశాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి, ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచి మూడు మార్గాల్లో భక్తులు ఈ గిరులకు వస్తారు. జరడ (ఇచ్చాపురంనుంచి వేరే మార్గంలో ఒడిశావైపు) మీదుగా కొందరు, పర్లాకిమిడి మీదుగా మరికొందరు, మందస మీదుగా ఎక్కువమంది మహేంద్రగిరులకు చేరుకుంటారు. మామూలు రోజుల్లో కీకారణ్యంగా ఉండే ఈ మార్గాల్లో శివరాత్రి సందర్భంగా ఆదివాసీలు, ఒడిశా ప్రభుత్వం భక్తులు నడవటానికి వీలుగా చిన్నపాటి కాలిబాటల్లా చెట్లను తొలగించి ఏర్పాటు చేస్తారు. ప్రకృతి అందాలకు, అబ్బురపరిచే ఆలయాలకు నిలయమైన మహేంద్రగిరులపై శివరాత్రి అనుభూతి అనిర్వచనీయమైనదని సందర్శకులు చెబుతారు.
పాండవుల గుడులు
అరణ్యవాసం సందర్భంగా పాండవులు ఈ గిరులపైనే కొంతకాలం గడిపారని, వారే ఇక్కడ ఆలయాలు నిర్మించారని, ఆ ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని భక్తుల విశ్వాసం. పాండవులు శివుడిని గోకర్ణస్వామిగా కొలిచారని చెబుతారు. పరశురాముడు ఇక్కడే శివుడిని ఆరాధిస్తూ తపస్సు చేశాడని, ఆయన కొన్ని ఆలయాలను నిర్మించాడని భక్తుల విశ్వాసం. కొంతదూరం రహదారి మార్గం ఉన్నా ఎక్కువదూరం కొండరాళ్లపైనే నడిచి ఎతె్తైన మహేంద్రగిరులపైకి భక్తులు చేరతారు. కొందరు మజిలీలు చేసుకుంటూ కొండపైకి చేరతారు. ఒరియా భక్తులైతే 3బిమ్మో జిక్కో2 (్భముడా మమ్మల్ని తీసుకువెళ్లు) అంటూ కొండలు ఎక్కుతారు. రెండు కొండల నడుమ కుంతీ కోవెల ముఖద్వారం పశ్చిమదిశలో ఉంది. ఈ ఆలయం ఎత్తు 30 అడుగులు. ఈ ఆలయం వెలుపల కుమారస్వామి, పార్వతీదేవి, విఘ్నేశ్వర విగ్రహాలు ఉన్నాయి. సుమారు 150 అడుగుల ఎత్తుగల ధర్మరాజు ఆలయం కొండపైనున్న ఆలయాలన్నింటికంటే పెద్దది. ఆలయం లోపల శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలు ఉన్నాయి. ధర్మరాజు ఆలయానికి కొద్దిదూరంలో నకుల, ద్రౌపది ఆలయాలు, గుడిపక్కగా సహదేవుని ఆలయం ఉంటాయి. దీనికి కిలోమీటరు దూరంలో పర్వత శిఖరంపై భీముని ఆలయం ఉంది. భీముని కోవెల చిన్నదైనప్పటికీ కొన్ని బండరాళ్ళ పొందికతో దీని నిర్మాణం ప్రత్యేకంగా కన్పిస్తుంది.
ఇక ప్రకృతి అందాలకు మహేంద్రగిరులపై కొదవలేదు. గిరిపై నిలుచుని ప్రకృతి అందాలను ఆస్వాదించి తీరాల్సిందే! చుట్టుపక్కల పల్లెలు, పట్టణాలు చిన్న చిన్న బొమ్మల్లా, జనం, వాహనాలు కదిలే చీమల దండులా కనువిందు చేస్తాయి. రాత్రివేళ విద్యుద్దీపాల కాంతిలో ఈ అందాలు దేదీప్యమానమై దీపాల వరుసలా కన్పించి నేత్రానందం కలిగిస్తాయి. సూర్యోదయం సమయంలో ఆకాశం పసుపువర్ణ శోభితంగా మారి అంతలోనే ఎర్రని బంతిలా భాస్కరుడు సముద్ర గర్భంలో నుంచి బయటకు వచ్చే అద్భుత దృశ్యాన్ని అందరూ చూసి తీరాల్సిందే. అందుకే శివరాత్రి పర్వదినాన సూర్యోదయ సమయానికే శిఖరాగ్రానికి చేరుకోవాలని యాత్రికులు ఊవ్విళ్ళూరుతుంటారు. ఇక శివరాత్రినాడు అడవిబిడ్డలు, ఆదివాసీలు ఈ ఆలయాలవద్ద ప్రత్యేక పూజలు జరుపుకోవడం ఆనవాయితీ.

-ఉరిటి శ్రీనివాస్