Others

ఏది సత్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కలియుగాంతంలో హిమాలయముల నుండి సిద్ధపురుషులు వచ్చి ఇక్కడి ప్రజలకు ధర్మాన్ని బోధిస్తారని భాగవతంలో వుంది. దేవీభాగవతంలో మాత్రం కలియుగాంతంలో ప్రళయం వచ్చి ప్రపంచాన్ని ముంచివేయగా, ఆ తరువాత మళ్ళీ కృతయుగం ఆరంభమవుతుందని రాశారు. ఇందులో ఏది సత్యం?
- సి.వాసుదేవరావు, శ్రీకాకుళం
సృష్టి, సంహారం, యుగచక్ర పరిభ్రమణం, ఇత్యాద్యంశాల గురించి ప్రతి పురాణంలోనూ వర్ణన వుంటుంది. ఇది పురాణానికి గల పంచ లక్షణాలలో ఒక భాగం. ఇలా ప్రతిచోటా ఒకే విషయాన్ని ప్రతిపాదించవలసి వుంటుంది గనుక, ఆయా మహర్షులు ఆయా పురాణాలను బోధించేటప్పుడు కొన్ని అంశాల్లో సంగ్రహంగానూ, కొన్ని అంశాల్లో విస్తారంగానూ, ఈ విషయాలను ప్రతిపాదిస్తూ వుంటారు. అవన్నీ పరస్పర పరిపూరకాలుగా వుంటూ వుంటాయి. అందువల్ల అనేక పురాణాల కథలను తీసుకుని, వాటిని జోడించుకుని సమగ్ర చిత్రాన్ని రచించుకోవలసి వుంటుంది. ప్రస్తుత కలియుగాంత విషయంలో- మొదట ప్రళయం వస్తుంది. కొంత సృష్టి మిగిలి వుంటుంది. ఈలోగా విష్ణుమూర్తి యొక్క దశమావతారమైన కల్కి అవతారం వచ్చి ధర్మపునరుద్ధరణకై కృషిచేస్తుంది. ఈ దశలో హిమాలయ గుహానివాసులైన సూక్ష్మదేహధారులైన మహాసిద్ధ పురుషులు అనేకమంది తాత్కాలిక స్థూల దేహాలను ధరించి, జనావాసాల్లోకి ప్రవేశించి, ధర్మవ్యవస్థాపనకు తమవంతు సహకారాన్ని అందించి, కల్కిదేవుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇది సూక్ష్మంగా సమగ్ర కలియుగాంత చిత్రం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org