Others

గీతతో రాతలు మహోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే మోక్షదాయకమని భక్తుల విశ్వాసం. ముక్కోటి దేవతలు కూడా భగవంతుని ఉత్తర ద్వారం నుండి దర్శిస్తారని, అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతున్నదని అంటారు. మరొక విశేషమేమంటేఈ ఏకాదశినే ‘గీతా జయంతి’ పరిగణిస్తున్నారు.
భగవద్గీత ప్రస్థానత్రయంలో ప్రసిద్ధమైంది. మహాభారతంలో యోగీశ్వరుడైన కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో అర్జునునికి చెప్పిన ఉపదేశం ‘సర్వశాస్తమ్రరుూ’ అనగా సమస్త శాస్త్రాల సారమని గీతామహత్మ్యం ఉటంకిస్తున్నది. భగవద్గీతకు గల ప్రాముఖ్యం ఎంతటిదంటే ఖండ ఖండాంతరాలలో ఆయా దేశ భాషలలోనికి అనువదింపబడి అభ్యసించబడుతున్నది. ఎందరో మహనీయులు భగవద్గీతను పఠించి ఎంతో మేలును పొందినట్లు చెప్పేరు.
భగవద్గీతలో స్వల్పంగా కనిపించే విషయాలను వివరిస్తూనే మోక్షాన్ని పొందేటందుకు వీలుగా బ్రహ్మ విద్యను బోధించే జ్ఞానాన్ని నిబంధించబడి ఉంది. ఈ విషయం ప్రతి అధ్యాయం ముగిస్తూ ‘‘ఇతి శ్రీమద్భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే’’ అని ఉంటుంది. భగవద్గీత ఉపనిషత్సారము, యోగవిద్య కూడా. ఇది శ్రీకృష్ణార్జునుల మధ్య సంవాదంగా అనిపించినా, జీవాత్మకు పరమాత్మకు మధ్య గల సంబంధాన్నీ, అద్వైత భావననీ గుర్తుచేస్తుంది. నరుడికీ, నారాయణునికి మధ్యనున్న సంబంధాన్ని, నరుని రూపంలో ఉన్న అర్జునునికి చెప్పినట్లుగా సమస్త మానవ జాతికీ క్రియాశీలురుగా రూపొందించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేందుకు శ్రీకృష్ణుని ముఖతః వెలువడిన ఉపనిషత్సారము భగవద్గీత. భగవద్గీత పదునెనిమిది అధ్యాయాల యోగ గ్రంథము. ఏడు వందల శ్లోకాలుగలది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలుగా ‘షట్కత్రయం’గా విభాగించబడింది. కొందరు జ్ఞానయోగంలో రాజయోగం కూడా చేరుస్తారు. నిజానికి ప్రతి అధ్యాయం యోగశాస్తమ్రే. అర్జున విషాదయోగంతో మొదలై మోక్ష సన్యాస యోగంతో ముగుస్తుంది.
సాధారణంగా మనుష్యులు కష్టాలలో ఉన్నపుడే భగవంతునికోసం ప్రాకులాడుతాడు. సలహాలకోసం ఎదురుచూస్తాడు. ప్రథమాధ్యాయంలో జరిగిందిదే. ఈ అధ్యాయంలో ప్రధానంగా రెండు సంగతులు తెలుస్తాయి. మనిషి నిండా స్వార్థం గూడుకట్టుకుని ఉంటుంది. నేను-నాది అనే మమకారం అతణ్ణి అంధునిగా చేస్తుంది. దానికి ప్రతీకయే ధృతరాష్ట్రుడు. తనవారిని గురించి ప్రత్యర్థులు పాండవులు గురించి సంజయుని ప్రశ్నిస్తాడు. ‘స్వ’ ‘పర’ భేదం ఉన్నంతవరకు మనస్సులో సంఘర్షణకు తావు వుంటుంది. అలానే అర్జునుడు క్షత్రియ ధర్మమైన యుద్ధం చేయనంటాడు. క్షత్రియ ధర్మం కాని భిక్షాటనం మేలంటాడు. స్వార్థం, ధర్మాల గురించి కృష్ణుడు చెప్పవల్సి వచ్చింది.
కృష్ణుని మాటల్లోని సారాంశం ఏమంటే ఈ శరీరం ఒక ధర్మక్షేత్రం. దీనిలో దుర్గుణాలకు ప్రతీకలు కౌరవులైతే, సద్గుణాలకుకు ప్రతినిధులు పాండవులు. అందుకే సద్గుణాలవైపు నిలుచుని కురుక్షేత్రంలో ధర్మవ్యవస్థాపనకు కంకణం కట్టుకున్నానంటాడు. ఇలా మొదటి అధ్యాయం నుంచి ఒక్కొక్కమెట్టుగా పదునెనిమిది అధ్యాయాలలో కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను తెలియజేస్తూ తాను భగవత్సరూపమేని, తనకు శరణాగతుడైన వానికి ముక్తి లభిస్తుందని ఘంటాపధంగా చెబుతాడు. ఒక్కొక్క యోగం గురించి విశదపరుస్తూ, అర్జునినుకిగల సందేహాలను నివృత్తి చేస్తూ, తన మార్గంలోనికి తీసుకునిరావడంలో అమృతత్వాన్ని ప్రసాదించగల తత్త్వాన్ని బోధించాడు.
యోగశాస్తమ్రైన భగవద్గీత ప్రతి యోగాన్నీ మరొక యోగంతో సమన్వయపరుస్తూ అత్యద్భుత రీతిలో ప్రవచిస్తూ ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు అన్వయించుకోవాలని చెప్పాడు. ఇంత చెప్పినా అర్జునుని ‘నువ్వు తప్పక యుద్ధం చేయవల్సిందే’ అని బలవంతం చేయలేదు. ‘యోగవిద్య, బ్రహ్మవిద్య, ఉపనిషత్తుల సారమంతా నీకు సందేహ నివృత్తి చేస్తూ చెప్పాను. ఇపుడు నీకు ఏది ఇష్టమని తోచితే ఆ విధంగా నిర్వర్తించు అని నిర్ణయాన్ని అర్జునునికే వదిలేశాడు. భగవద్గీతను శ్రద్ధ్భాక్తులతో పఠించి, ధర్మసంబంధమైన తాత్త్వికతను తెలుసుకుని మన జీవితాలకు అన్వయింపజేసుకుని సత్ఫలితాలను పొందుదాం.

-ఎ. సీతారామారావు