ఎడిట్ పేజీ

ఫెరుగుతున్న అంతర్గత శత్రువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కు ముస్లింలపట్ల తనకున్న వ్యతిరేకత విషయంలో ఎలాంటి దాపరికాలు లేవు. ఇస్లాం మతం అంటే ఆయన ఒంటికాలి మీద లేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఆశావహులుగా ఉన్నవారందరిలోకి ఆయన పేరు మారుమోగి పోతోంది. రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన ఎంపిక కావడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయని ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముస్లింలపై ఆయన చేస్తున్న దూషణలను, ముస్లింలపట్ల ఆయనకున్న భయాలను పట్టించుకోకుండా అమెరికా ఓటర్లలో చాలామంది ఆయనను అభిమానిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలో సంపన్నమైన, అత్యంత శక్తిమంతమైన, ప్రభావశీల అమెరికాలో ఇస్లాంపట్ల భయాలు వేళ్లూనుకోవడానికి కారణం ఏమిటి? అమెరికాలో ఈ తాజా ధోరణులకు బాధ్యులెవరు? దేశంలో ఇస్లాం వ్యతిరేకత వేళ్లూనుకుంటోందనుకోవాలా? అమెరికాలో కనిపిస్తున్న వర్తమాన పోకడకు కారణమేంటి? 9/11 దాడులా? ఐఎస్‌ఐఎస్ చేపట్టిన దురాగతాలను ప్రపంచం ప్రత్యక్షంగా వీక్షించడం వల్లనా? ప్రపంచంలోని మొత్తం ముస్లిం ప్రపంచం అమెరికానే లక్ష్యం చేసుకోవడం వల్లనా? ఐరోపా మొత్తం సుస్థిరంగా ముస్లిం యూరప్‌గా మారిపోతుండడమా?
ఇటీవలి ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలైనా, జర్మనీ ఛాన్స్‌లర్ ఎంతమాత్రం పాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా ఆమె ప్రభుత్వం అమలు జరుపుతున్న వలస విధానం మొత్తం ఐరోపా ఖండంలో జనాభా పరంగా విపరీతమైన మార్పులకు దోహదం చేయడమే ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ పరాజయానికి కారణమన్నది ఆమె గుర్తించకపోవడం విచిత్రం!
ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం వ్యతిరేకత చుట్టుముడుతున్నప్పటికీ, మనదేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా హిందూ వ్యతిరేకత అనే విచిత్ర ఫోబియా, సమాజంలోని కనీసం ఒక వర్గానికి చెందిన వారి మనసులను, మీడియాను ఆక్రమించింది. దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు మనం స్పష్టంగా చూశాం. యోగా అంటే ‘కుక్క కాళ్లు బారచాపి పైకి లేవడానికి చేసే యత్నం’ లాంటిది అంటూ ఒక ఎర్ర మేధావి అప్పట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పార్లమెంటులో బలంలేని, ప్రజల్లో పలుకుబడిలేని ఈ పుర్రచేతి నాయకుడు గొంతు చించుకొని యోగాను వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం? హిందూయిజానికి సంబంధించినంతవరకు అతగాడు, అతని వందిమాగధులు చేసిన ధిక్కారమిది. ఇక మీడియా మహాశయులు మరింత ముందుకెళ్లారు. యోగా దినాన్ని నిర్వహించడం ద్వారా నరేంద్రమోదీ తన హిందూత్వ అజెండాను ముందుకు తీసుకు రావాలని చూస్తున్నాంటూ, చురుకుదనం పాలు ‘ఎక్కువైన’ యాంకర్లు ఒకటే గగ్గోలు. మరికొందరైతే యోగం శాస్ర్తియమైనదేనా? అంటూ చచ్చు ప్రశ్నలు! ఇక ముస్లింలు తమ సంప్రదాయం ప్రకారం యోగ ఇస్లాంకు విరుద్ధమని పేర్కొన్నారు. మరి మన ఘనత వహించిన ‘ఉదారవాదులు’ కొన్ని కోట్లమంది హిందువులు పాటించే ఆచారాన్ని ఖండించడానికి, పైనుంచి ఊడిపడ్డారనుకోవాలా!
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థవారు ఢిల్లీలో ప్రపంచ సాంస్కృతిక దినోత్సవాన్ని నిర్వహించిన సందర్భంగా మళ్లీ ఈ హిందూఫోబియా ఒక్కసారిగా జడలువిప్పింది. హిందూ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఈసారి లిబరల్స్ ‘పర్యావరణవేత్తల’ను ఎంచుకున్నారు. ఈ ఉత్సవాలు నిర్వహించడం వల్ల యుమున, దాని జీవావరణ వ్యవస్థ మరమ్మతు చేయడానికి వీలుకానంత దారుణ స్థాయిలో దెబ్బతింటాయని ప్రచారం మొదలెట్టారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వారు ఒదిలిపెట్టలేదు. ఈ కార్యక్రమం ద్వారా ‘హిందూ ఇండియా’ ను ప్రదర్శించే అవకాశమున్నదేమోనన్న భయాన్ని అభినయించారు. పూర్తిగా ఒక వారం పాటు ఇంగ్లీషు ఛానళ్లు ఈ కార్యక్రమంపై విపరీతమైన తప్పుడు ప్రచారం చేశాయి. యమునా నదిలోని 55 టన్నుల చెత్తను తొలిగించామంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు స్పష్టం చేయడంతో, సమర్ధించుకునే మార్గం లేక, అసలు ఈ కార్యక్రమానికి అనుమతులు ఎవరిచ్చారంటూ ప్లేటు ఫిరాయించారు. మరి ఇంతటి గందరగోళాన్ని వీరెందుకు సృష్టిస్తున్నారు? దీనికి కారణం, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీరవిశంకర్, ప్రధాని నరేంద్ర మోదీకి ఆధ్యాత్మిక పరంగా వెన్నుదన్నుగా ఉన్నవారిలో ఒకరు కావడమే! నిజానికి వారి లక్ష్యం శ్రీ శ్రీరవిశంకర్ కానే కాదు. ఆయన ద్వారా మోదీ లక్ష్యంగా, కార్యక్రమాన్ని ఏదోవిధంగా అభాసుపాలు చేలన్నదే వారి ముఖ్యోద్దేశం. అదే జరిగితే అది నేరుగా నరేంద్ర మోదీపై ప్రభావం చూపుతుంది!
ఇక మన ఉదారవాదుల దృష్టిలో బాబా రామ్‌దేవ్ ఒక గొప్ప విలన్! ఎందుకంటే ఆయన మూలాలు యోగ, ఆయుర్వేదాల్లో ఉన్నాయి. గత యుపిఎ ప్రభుత్వం ప్రతి దశలో ఆయనపై, ఆయన సహచరుడిపై అనేక కేసులు బనాయించింది. మరి అదే రామ్‌దేవ్ బాబా ‘యునానీ’ని ప్రచారం చేస్తే మన ఉదారవాదులకు, ఆయనంత గొప్ప మిత్రుడు మరొకరుండరు.
ఇక వీరు వివాదం సృష్టించాలనుకుంటున్న మరో అంశం ‘మహిళల ఆలయాల ప్రవేశం’ అంశం. ఇక మీడియా విషయం చెప్పాల్సిన పనేలేదు. తాము పుట్టిందే లింగ వివక్షతను రూపుమాపడానికన్న రీతిలో రెచ్చిపోయారు. వీరి ప్రచారం ఎంతటి స్థాయిలో కొనసాగిందంటే, అసలు మహిళలకు దేవాలయాల్లో ప్రవేశించడం, ప్రార్థన జరపడం నిషిద్ధమన్న స్థాయిలో వాతావరణాన్ని సృష్టించారు! మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నదంటూ ఒక మతంపై బురద చల్లడం ఎంతటి అమానుషం! ఈవిధంగా ప్రచారం చేసే కార్యకర్తలెవరూ నిజంగా ప్రార్థనలు జరపాలన్న ఉద్దేశం ఉన్నవారు కాదు. దేశం మొత్తంమీద వేలాది దేవాలయాలుండగా కేవలం రెండు, మూడింటిని మాత్రం తీసుకొని రచ్చ చేయడం వీరికే చెల్లింది. ప్రతి రోజు దేశం మొత్తంలోని ఆలయాల్లోకి వెళ్లి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా మహిళలు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
హిందూ మతం అత్యంత సంక్లిష్టమైంది. సంప్రదాయాలు, క్రతువులు, బలీయమైన ఆచారాలు ఆచరణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈనాటివి కావు, వేలాది ఏళ్ల క్రితం నుంచి హిందువులు పాటిస్తూ వస్తున్నారు. ఇందులో మహిళలలను అడ్డుకునేవి ఏవీ లేవు. నిజానికి తమిళనాడులోని ఆదిపరాశక్తి ఆలయాల్లో కేవలం మహిళలు మాత్రమే ప్రార్థనలు జరపడానికి అనుమతిస్తున్నారు! కేరళలో భాగవతి అనే దేవాలయం ఉంది. ఋతుస్రావ సమయంలో ఆ దేవత, ఉపయోగించే వస్త్రాన్ని పవిత్రంగా భావించి, భక్తులకు బహూకరిస్తుంటారు. నిజానికి ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతానికి చెందిన ఆచార వ్యవహారాలను అనుసరించడం అతని ప్రాథమిక హక్కు. ఇందులో మహిళలపై వివక్ష ఏమున్నది? ఏ మతం కూడా మహిళలకు పురుషులతో పాటు సమాన ప్రాముఖ్యతనివ్వదనే అంశాన్ని మనం అంగీకరించాలి. అయితే కేవలం హిందూయిజానే్న ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? ఎందుకంటే..ఆపేర్న ఆరాచకం సృష్టించడం మన దేశ-వ్యతిరేకుల గొప్ప రూపచిత్రణ కాబట్టి!
మన రాజకీయనేతలు, మీడియా కలిసి కన్హయ్యకుమార్‌ను ఒక విప్లవ వీరుడిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అతగాడు కేవలం హిందూ మతాన్ని అవహేళన చేసే నినాదాలిస్తాడు కనుక! లేకపోతే అతగాడికున్న మరో గొప్ప అర్హతలేంటి? కాళీ మాతను సెక్స్‌వర్కర్‌గా చిత్రీకరించడం, మహిషాసురుణ్ణి పొగడడమనేవి తప్ప! ఇప్పుడు చాలామంది ఉదారవాదులు, మహిషాసురుడు శక్తివంతమైన గిరిజన నేత అంటూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాస్తున్నారు. ఇక్కడ అర్థంకాని విచిత్రం ఒకటుంది. ఈ లిబరల్స్ ఒకవైపు రామాయణం, మహాభారతాలను ఇతిహాసాలుగా అంగీకరించరు. కానీ మరోవైపు మాత్రం కాళి, మహిషాసురుణ్ణి ఆమోదిస్తారు! ఆవిధంగా ఒకదాన్ని ఆమోదించి మరోదాన్ని తిరస్కరించడం ఎంతవరకు సమంజసం? ఇతిహాసాలను చారిత్రక సంఘటనలుగా అంగీకరించనప్పుడు, అదే చరిత్రలో భాగమై మహిషాసురుణ్ణి ఏవిధంగా ఆమోదిస్తారు?
ఇప్పుడు ఏఐఎంఐఎం నేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఏమంటాడంటే, ‘‘నేను భారతమాతాకీ జై’’ అనను! ఒకవేళ కుత్తుకపై కత్తిని పెట్టినా సరే ‘్భరత్‌మాతాకీ జై’ అని పలకను అంటూ ప్రకటించాడు. అటువంటి నినాదాలు చేయడానికి మన రాజ్యాంగం అనుమతించిందా? జాతీయగీతాన్ని ఆలాపించాలని లేదా జాతీయ పతాకానికి లేచి నిలబడి సెల్యూట్ చేయాలని రాజ్యాంగం చెప్పిందా? కేవలం మన జాతీయ చిహ్నాలైన వాటి పట్ల గౌరవ సూచికంగా మనం ఆవిధంగా లేని నిలబడి సెల్యూట్ చేస్తున్నాం. ఎవరో ఒకరు నేను ‘‘్భరత్ మాతాకీ జై’’ అనను అని రంకెలు వేయడం, ఇప్పటికే దేశ వ్యతిరేక ‘మురికి’ కుప్పలుగా పేరుకుపోయిన దానికి చిహ్నం. ఇవన్నీ దేశ వ్యాప్తంగా అంతర్గత శత్రువులు విస్తరించి ఉన్నారనడానికి నిదర్శనాలు.

srramanujan@gmail.com సెల్ : 8008322206