రాష్ట్రీయం

దిగులొద్దు.. ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరద బాధితులకు కేంద్ర బృందం హామీ

నెల్లూరు/తిరుపతి/ఒంగోలు, డిసెంబర్ 10: వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇందుకు వీలుగా మార్గదర్శకాల్లో మార్పులు తీసుకొస్తామని కేంద్ర బృందం వెల్లడించింది. గురువారం నెల్లూరు,గూడూరు,కావలిలోని కొన్ని గ్రామాల్లో ఈ బృందం పర్యటించింది. పొలాల్లోకి ఇసుక మేట వేసిన వైనం , చేనేత కార్మికుల మగ్గాల గుంతల్లోకి వర్షపునీరు చొచ్చుకొచ్చిన వైనాన్ని కళ్లారా చూసి ఆవేదన చెందారు. పొలాల్లో ఇసుక మేట తొలగించడానికి పరిహారం పెంచడానికి వీలుగా నిబంధనలు సడలించాలని కోరుతామని సహాయ బృందం సారధి, కేంద్ర హోమ్ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గే తెలిపారు. నెల్లూరులో పలు ప్రాంతాలను ఈ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వినిపించి నష్ట పరిహారంలో కూడా న్యాయం జరగడం లేదని తెలిపారు. అనంతరం ఐదో నెంబర్ జాతీయ రహదారిపై మనుబోలు వద్ద గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. వెంకటాచలం మండలంలో నిడిగుంటపాళెంలో వరద నష్టాలను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో వరద నష్టానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను సహాయ బృందం సభ్యులు తిలకించారు.
చిత్తూరు జిల్లాలో ఇటీవల తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించామని, త్వరలోనే దీనిపై కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని వరద అంచనాల కమిటీ బృందం ప్రతినిధి ఎస్.ఎన్.కొల్వట్కర్ వెల్లడించారు. ఇటీవల నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాల జరిగిన నష్టాన్ని అంచనావేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన రెండు కేంద్ర బృందాలు మూడు జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు, నాగలాపురం, నగరి, పిచ్చాటూరు మండలాల్లో వరద నష్టాన్ని అంచనా వేశామన్నారు. క్షేత్రస్థాయిలో నీట మునిగిన పంటలను పరిశీలించామని, బాధిత రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నామని వివరించారు. జిల్లాలో చేనేత కార్మికుల సమస్యలను తమ బృందం పరిశీలించిందని, వారి సమస్యల పరిష్కారానికి కేంద్రానికి సిఫార్సు చేస్తామన్నారు.
జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను, కల్వర్టులను వివిధ కాలువలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారుల నుంచి సమాచారం తీసుకుని కేంద్రానికి పంపుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, కరవువల్ల తాము తీవ్రంగా నష్టపోయామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కేంద్ర బృందానికి పత్తిరైతులు విన్నవించారు. గురువారం తమ ప్రాంతాలకు వచ్చిన ప్రకాశం కేంద్ర బృందానికి తమ గోడు వినిపించారు. ఈసందర్భంగా కేంద్ర కరవుబృందం టీం లీడర్ బెహర్ రైతులతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని కరవుప్రాంతాల్లోని రైతులను అన్నివిధాల ఆదుకునేందుకు తాము వచ్చామని, పూర్తిస్ధాయిలో అద్యాయనం చేసి తగిన నివేదికను కేంద్రప్రభుత్వానికి అందచేస్తామని తెలిపారు.