ఆంధ్రప్రదేశ్‌

ఏడాదిలో 6.6 లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో 6.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2011 లెక్కల ప్రకారం పక్కా ఇళ్లు లేని కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో 33.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 6.5 లక్షల కుటుంబాలున్నాయి. ప్రతి ఏటా కనీసం 10 లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా 2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ఏడాది గృహనిర్మాణానికి ప్రభుత్వం 1132.83 కోట్లు కేటాయించింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రాష్టవ్య్రాప్తంగా ఈ ఏడాది రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటికి 2.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంటి నిర్మాణం నిమిత్తం ఎస్సీ , ఎస్టీలకు లక్షా యాభైవేల రూపాయిలు, ఇతరులకు లక్ష రూపాయిలు సబ్సిడీగా ఇస్తారు. మిగిలింది లబ్దిదారుడే భరించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించే 55వేల ఇళ్లకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున రెండు లక్షల రూపాయిలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇళ్ల నిర్మాణానికి అర్హుల గుర్తింపు కూడా పూర్తయింది. జిల్లాల వారీ ఇళ్లకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేస్తున్నారు. 14వ తేదీ వరకూ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 50,203 ఇళ్లకు పాలనాపరమైన అనుమతి ఇచ్చారు. వాటిలో అత్యధికంగా పశ్చిమగోదావరిలో9757, కృష్ణాలో 9698 ఇళ్లకు అనుమతి ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 4996, విజయనగరం జిల్లాలో 1751, నెల్లూరు జిల్లాలో 6219, చిత్తూరులో 7918, కడపలో 2741, అనంతపురంలో 4623, కర్నూలులో 2500 ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన నాలుగు జిల్లాలు శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ప్రకాశం లలో లబ్దిదారుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. కాగా హుదూద్ బాధితుల కోసం 8162 ఇళ్లను మంజూరు చేశారు.