క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, మార్చి 14 : మండల పరిధిలోని మెళవాయి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ రఫిక్ (42) మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి కుటాగూళ్లకు చెందిన మహమ్మద్ రఫిక్ వివిధ ప్రాంతాల్లో చింతపండు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించి జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగా శిరా, అమరాపురం ప్రాంతాల్లో చింతపండు కొనుగోలు చేసి లారీలో విజయవాడకు తరలించారు. తన కారులో మహమ్మద్ రఫిక్ స్వగ్రామానికి వెళ్తుండగా తెల్లవారుఝామున నిద్రమత్తులో మెళవాయి ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై లింగన్న ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తలుపు విరిగి పడి బాలుడి మృతి
హిందూపురం టౌన్, మార్చి 14 : మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో తలుపు విరిగి పడిన సంఘటనలో రాజేష్ (5) మృతి చెందాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు రామచంద్ర, జయమ్మ గొడవపడి ఇంటి తలుపులు వేసుకుని ఘర్షణ పడ్డారు. అయితే గొడవ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న రామచంద్ర బావ చంద్రశేఖర్ బలవంతంగా తలుపును కొట్టడంతో తలుపు విరిగి పడి నిద్రిస్తున్న రాజేష్‌పై పడింది. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
డీ.హీరేహాల్, మార్చి 14 : మండల పరిధిలోని కళ్లెం గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లెం గ్రామానికి చెందిన హులికుంట (32) అక్కడిక్కడే మృతి చెందాడు. హులికుంట పొలం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాన రహదారిపైకి వస్తుండగా బళ్లారి నుంచి రాయదుర్గం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సిమెంట్ రోలర్ కింద పడి చిన్నారి మృతి
కంబదూరు, మార్చి 14 : మండల పరిధిలోని ములకనూరు గ్రామంలో సిమెంట్ రోలర్ కింద పడి చిన్నారి దుర్గకుంట మహిమా (09) అక్కడికక్కడే మృతి చెందింది. హుటాహుటిన సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ నరసింహులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదినారాయణ, సువర్ణమ్మ ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.