క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం రూరల్, మార్చి 24 : మండల పరిధిలోని కెంచానపల్లి గ్రామానికి చెందిన మాణిక్యరాజు (18) శనివారం పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కెంచానపల్లికి చెందిన రామాంజనేయులు, వరలక్ష్మి కుమారుడు మాణిక్యరాజు ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో లోన్ ద్వారా ఆటో తీసుకుని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆటో ద్వారా వచ్చిన సంపాదనను రోజూ తల్లికి ఇచ్చేవాడు. ఈనేపథ్యంలో ఆటో కంతు కట్టడానికి డబ్బులు అడిగిన విషయంలో తల్లీకొడుకు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురై గ్రామ సమీపంలో ఉన్న కొండ వద్దకు వెళ్లి టిమెట్ గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈమేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్ దూసుకెళ్లి చిన్నారి మృతి
అమరాపురం, మార్చి 24 : మండల పరిధిలోని కాచికుంట గ్రామంలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్లకుమార్ కుమార్తె భూమిక (2) ఇంటి పక్కన ఉన్న ఎరువుల దిబ్బపై మల విసర్జన చేస్తుండగా వేగంతో వచ్చిన ట్రాక్టర్ దూసుకెళ్లడంతో తీవ్రగాయాలకు గురైంది. వెంటనే బాలికను అమరాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నాటక శిరాకు తరలించారు. అప్పటికే భూమిక మృతి చెందినటు వైద్యులు ధ్రువీకరించారు. ఈమేరకు హల్కురుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

పాముకాటుతో విద్యార్థి మృతి
కణేకల్లు, మార్చి 24 : మండల పరిధిలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన ఆనంద్ (10) శుక్రవారం అర్ధరాత్రి పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న ఆనంద్‌ను పాము కాటు వేయడంతో కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆనంద్ 5వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎంఈఓ బసవరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

12 మంది ఈవ్‌టీజర్ల పట్టివేత
ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం అర్బన్, మార్చి 24: జిల్లా వ్యాప్తంగా మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా వేసి వారం రోజుల్లో 12 మంది ఈవ్‌టీజర్లను పట్టుకోవటం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శనివారం సంబంధిత శాఖాధికారులతో గత వారం రోజుల వ్యధిలో ఆయా సబ్ డివిజన్ల పరిధిలో అమ్మాయిలను వేధించే ఘటనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కళ్యాణదుర్గం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో అమ్మాయిలను వేధిస్తున్న ఐదుగురి ఈవ్‌టీజర్లను పట్టుకోవటం జరిగిందన్నారు. కదిరి డివిజన్ పరిధిలో ఇద్దరు, గుంతకల్లులో నలుగురు, ధర్మవరంలో ఒకరిని పట్టుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించటం జరిగిందన్నారు. అమ్మాయిలు మోసపోకుండా చైతన్యం తీసుకురావడంతోపాటు చట్టాలపై వారికి మరింత అవగాహన తమ సిబ్బంది కల్పించటం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.