క్రైమ్/లీగల్

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మే 31 : టిప్పర్ లారీ ఢీకొనడంతో గురువారం పట్టణానికి చెందిన వన్నూర్‌స్వామి(30) మృతి చెందినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. వన్నూర్‌స్వామి స్థానిక హనుమేష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తన తల్లి బస్టాండ్ సమీపంలో పండ్ల వ్యాపారం చేసి కుమారుడితో కలసి జీవనం సాగిస్తుంది. అయితే తల్లి వద్దకు వచ్చిన వన్నూర్‌స్వామి బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని టిప్పర్ ఢీకొంది. దీంతో వన్నూర్‌స్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో రూ.70 వేల నష్టం
మడకశిర, మే 31 : మండలంలోని మెళవాయి గ్రామానికి చెందిన రమేష్ నివాసంలో గురువారం చోటు చేసుకున్న విద్యుదాఘాతంతో రూ.70 వేల నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. ఇంట్లో ఉన్నఫళంగా మంటలు వ్యాపించడంతో కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ఆహార ధాన్యాలు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ.70 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వపరంగా తగిన సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.

పేకాటరాయుళ్ల అరెస్టు
పుట్లూరు, మే 31 : పుట్లూరు మండలంలోని ఎస్.కొండేపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ సురేష్‌బాబు తమ సిబ్బందితో వెళ్ళి పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.51870లను నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మట్కాబీటర్ల అరెస్టు
కళ్యాణదుర్గం, మే 31 : మట్కా నిర్వాహకులతోపాటు బీటర్లను అరెస్టు చేసి రూ.3.5 లక్షలు నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంబదూరు మండలం అయ్యంపల్లికి చెందిన వెంకటేసులు, కంబదూరుకు చెందిన పెయింటర్ రాము మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో కంబదూరు, రామగిరి ఎస్‌ఐలు సిబ్బందితో దాడులు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను విచారించగా వైఎన్‌హెచ్ కోటకు చెందిన శ్రీనివాసులు, హనుమంతరాయడు, వీరేష్ ఆడుతున్నట్లు తెలిపారన్నారు. నిందితులను అరెస్టు చేసి రూ.3.5 లక్షలు నగదు, ఆరు సెల్‌ఫోన్లు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.