అవునా.. ఐశ్యర్యా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందించే తదుపరి చిత్రంలో మెగా హీరో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన ఈ సినిమా జూలైలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా తెలుగు హీరోతో సినిమా చేయాలని మణిరత్నం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఫైనల్‌గా రామ్‌చరణ్‌కు ఈ అవకాశం దక్కింది. అయితే ఈమధ్యే వచ్చిన ‘చెలియా’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో రామ్‌చరణ్ ఆలోచనలో పడ్డారట. ఈ సినిమాలో ఏదైనా ప్రత్యేకత ఉండేలా చర్యలు తీసుకోమన్నాడట రామ్‌చరణ్. ఈ నేపథ్యంలో మణిరత్నం సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ మణి ఎప్పుడు పిలిస్తే ఆయన సినిమాలో చేసేందుకు సిద్ధమని ఆమధ్య కమిట్‌మెంట్ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ సినిమాలో ఐశ్వర్యారాయ్‌ని హీరోయిన్‌గా పెట్టాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై చరణ్ కూడా ఆసక్తిగా వున్నాడట. మరి ఈ విషయంపై మణిరత్నం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి నటించే 151వ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌ను నటింపచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి చరణ్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఐశ్వర్యారాయ్ ఆసక్తి చూపుతుందా అనేది అసలు విషయం. ఏదైనా ఈ విషయంపై క్లారిటీ రావాలంటే యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే!