రాష్ట్రీయం

విశాఖపట్నంలో ఆయుర్వేద వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో మంత్రి కామినేని వెల్లడి
హైదరాబాద్, మార్చి 17: విశాఖపట్నంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఆయుర్వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ వర్శిటీకి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందని, ఇందుకోసం వందెకరాల స్థలాన్ని సేకరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎన్‌టిఆర్ వైద్య సేవలు 298 ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, మొత్తం 1044 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 1.31 కోట్ల కుటుంబాలకు ఈ సేవలు అందిస్తున్నామని వివరించారు. రైతు బజార్లలో సమాచారం కోసం రైతుసేవ ఏర్పాటు చేశామని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. విజయనగరం జిల్లా ఎస్.కోట, తూర్పుగోదావరి జిల్లా మండపేట, పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, తణుకు, కృష్ణా జిల్లా కూచిపూడి, గుంటూరు జిల్లా పొన్నూరులలో కొత్తగా రైతుబజార్లను మంజూరు చేశామన్నారు. అలాగే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేశామన్నారు. రైతుల రుణాలను ఒకే దఫా మాఫీ చేయడం లేదని, అయితే రుణమాఫీ పరిధిలోకి వచ్చే రైతులకు తాజాగా మళ్లీ రుణాలు లభించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పత్తిపాటి స్పష్టం చేశారు. రైతులపై వడ్డ్భీరం కానీ, అపరాధ వడ్డీ భారం కానీ వేయడం లేదని పేర్కొన్నారు.
ప్రధాన దేవాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రవర్తనా నియమావళి రూపొందించి అమలు చేస్తున్నామని దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుతెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాన దేవాలయాలన్నీ సిసి కెమెరాల నిఘాలో ఉన్నాయన్నారు. దేవాలయాల రక్షణకు 24 గంటల పాటు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
తిరుమల లడ్డూ ధర పెంచడం లేదు
తిరుమలలో లడ్డూ ప్రసాదం ధర పెంచే ఆలోచన ఏదీ లేదని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.అలాగే లడ్డూల నాణ్యత తగ్గిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ
కర్నూలులో 2016-17 సంవత్సరంలో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మానవ వనరుల మంత్రి గంటాశ్రీనివాసరావువెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక బిల్లును త్వరలో చట్టసభల్లో ప్రతిపాదిస్తామన్నారు.