రాష్ట్రీయం

భారీ బడ్జెట్‌పై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉండేలా బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కనీసం పది లక్షలైనా ఎక్కువ ఉండేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. లక్ష 30 వేల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుందని తెలంగాణ అధికారులు అంచన వేస్తున్నారు. ఆ రాష్ట్రాని కంటే కనీసం రూ. 10 వేల కోట్లు ఎక్కువ ఉండేలా రూ.లక్ష 40 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందుగా ఈ నెలాఖరులోనే శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ముందు అనుకుంది.
అయితే జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఫిబ్రవరి రెండవ వారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం. ద్రవ్య నిర్వహణ విధానం (ఎఫ్‌ఆర్‌బిఎం) మేరకు రాష్ట్రాలకు రుణ పరిమితి పెరిగే వెసులుబాటు ఉంటుంది.
కేంద్రం నుంచి ఎక్కువ గ్రాంట్ పొందడానికి రాష్ట్ర బడ్జెట్‌తో ముడిపడి ఉండటంతో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ రుణ పరిమితి పొందాలన్న వ్యూహాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ ఏడాది ప్రవేశ పెట్టాలని భావిస్తున్న రూ. లక్ష 40 వేల కోట్ల బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ. 62 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 78 వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్లు ఉండే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికార వర్గాల విశ్వనీయ సమాచారం. ఈ ఏడాది తమ బడ్జెట్ రూ. లక్ష 30 వేల కోట్లు ఉండే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సూచనప్రాయంగా వెల్లడించిన సమాచారాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బడ్జెట్ రూపకల్పనలో ఇరు రాష్ట్రాలు పోటి పడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత (2014-15) ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1,00,637 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే అదే ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,11,824 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ మరుసటి సంవత్సరం 2015-16 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,13,049 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, అంతకంటే ఎక్కువ ఉండేలా రూ. 1,15,689 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రణాళిక వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయాన్ని ఎక్కువ చూపెట్టడం ద్వారా ఈ ఏడాది బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధిగమించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.