రాష్ట్రీయం

భారత్‌లో ఉన్న స్వేచ్ఛ ఎక్కడా ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: భారతదేశంలో వున్నంత సహనం, స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా కనిపించదని అయితే ఈ విషయంపై కొన్ని శక్తులు రాద్దాంతం చేస్తున్నాయంటూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. అసలు సహనం, స్వేచ్ఛ లేదని ప్రపంచ దేశాల్లో ఎవరికైనా చెప్పేందుకు ధైర్యం, దమ్ము వుందా అని ప్రశ్నించారు. ఆయా ప్రభుత్వాలను కనీసం విమర్శ చేస్తేనే తలలు నరికివేసే పరిస్థితి అనేక దేశాల్లో కొనసాగుతున్నదన్నారు. ఇటీవల కాలంలో అవార్డులు, పురస్కారాలను వెనక్కిస్తున్నామంటూ బహు కొద్దిమంది విస్తృత ప్రచారం చేస్తున్నారంటూ అయితే వారికి వాటిని తీసుకునే అర్హత లేదనే భావన ఇప్పటికైనా చోటుచేసుకోవటం సంతోషకరమని అత్యధికమంది ప్రజలు భావిస్తున్నారు. స్థానిక కాకరపర్తి భావన్నారాయణ విద్యాసంస్థల ప్రాంగణంలో శుక్రవారం ‘సమ్మిళిత స్థిరమైన వృద్ధిలో వ్యాపార సంస్థలు-సామాజిక బాధ్యతలు-అనుసరిస్తున్న రీతులు’ అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సును వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమవుతుండగా ఒక్క భారతదేశంలోనే 7.3 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతున్నదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న రగడను ప్రస్తావిస్తూ పార్లమెంట్‌పై దాడిచేసి ఎంపీలందరిన్నీ హతమార్చేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోయిన 13మంది భద్రతా సిబ్బందిపై ఏ మాత్రం కనికరం లేకుండా దీనికంతటికీ సూత్రధారుడైన అఫ్జల్‌గురు ఉరిశిక్షను వ్యతిరేకించడం దారుణమన్నారు. గుజరాత్‌లో ఉచిత కరెంట్ లేకుండానే నరేంద్రమోదీ సిఎం కాగల్గారంటూ గత ప్రభుత్వాలు లోపవర్ ఆపై నో పవర్ చేసి ఉచిత కరెంటంటూ ప్రజలను మభ్యపెట్టిందన్నారు.