రాష్ట్రీయం

దోషులను వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతటి వారయినా శిక్షిస్తాం కాల్‌మనీపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
వార్తాకథనాలకు ఆధారాలు చూపాలని మీడియాకు నోటీసులు మండలినుంచి వైకాపా వాకౌట్

హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశంలో సోమవారం వడ్డీ వ్యాపారం (కాల్‌మనీ), నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తదితర అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే వైకాపా సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రోజాపై శాసనసభలో విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చైర్మన్ చక్రపాణి అందుకు అంగీకరించక పోవడంతో వైకాపా సభ్యులంతా సభనుండి వాకౌట్ చేశారు. అనంతరం చైర్మన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే సభలో కాల్‌మనీ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురైన వ్యక్తులు, సంస్థలతో పాటు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని, నేరాలకు పాల్పడిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం వడ్డీ వ్యాపారం (కాల్‌మనీ)పై జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున దీటుగా కాల్‌మనీ అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురైన వ్యక్తులు, సంస్థలు స్వేచ్ఛగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, కాల్‌మనీకి సంబంధించిన వారి వివరాలు ఇవ్వాలని కోరారు. నేరస్థులు ఎంతటి వారయినా వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అల్లర్లు జరిగినపుడు మతసామరస్యం కోసం కఠినంగా వ్యవహరించామన్నారు. శాంతిభద్రతల విషయంలో వెనకడుగు వేసేదిలేదని సిఎం స్పష్టం చేశారు. అధిక వడ్డీలను వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశామని, ఇందులో అధిక వడ్డీతో పాటు లైంగిక వేధింపుల ఫిర్యాదులున్నాయన్నారు. ఇప్పటికే జుడీషియల్ విచారణకు ఆదేశించామని, బాధితులు, ఫిర్యాదుదారులు జుడీషియల్ ముందుగాని, పోలీసు శాఖకు గాని స్వేచ్ఛగా ఫిర్యాదు చేసుకోవచ్చని, ఎవ్వరిని ఉపేక్షించే ప్రసక్తిలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. వైట్‌కాలర్ నేరాలు పెరిగిపోయాయని, అక్రమ వడ్డీలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకు వస్తున్నామని సిఎం వెల్లడించారు. ప్రత్యేక కోర్టులు పెట్టి విచారించి బాధితులకు తగిన న్యాయం చేస్తామన్నారు. కాల్‌మనీ వ్యవహారంపై వస్తున్న వార్తా కథనాల పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై మీడియాలో వస్తున్న ఆధారాల్లేని వార్తా కథనాలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతన్నారని అన్నారు. ఈ వార్తాకథనాలకు ఉన్న ఆధారాలు ఇవ్వాలని కోరుతూ మీడియాకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.