రాష్ట్రీయం

వచ్చేవన్నీ బ్యాంకులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల, విజ్ఞాన, భూ బ్యాంకుల ఏర్పాటు * మూడేళ్లలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు: బాబు
హైదరాబాద్, నవంబర్ 28: ఆంధ్రలో వాటర్ బ్యాంకు (జల), నాలెడ్జి బ్యాంక్(విజ్ఞాన), ల్యాండ్ (్భ) బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తామని, వీటితో అద్భుతాలు సృష్టించవచ్చని సిఎం చంద్రబాబు చెప్పారు. శనివారం ఆయన వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులతో మాట్లాడారు. వౌలిక సదుపాయాల కల్పనలో వాటర్ బ్యాంకు, భూ బ్యాంకులదే ముఖ్య భూమిక అవుతుందన్నారు. భూగర్భ స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్టవ్య్రాప్తంగా 1254 ఫిజో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మీ సేవ ద్వారా లావాదేవీల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, 180 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ఉపాధి అవకాశాలు, ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరక్షరాస్యుల్లో సైతం నైపుణ్యాభివృద్ధి పెంచడం ద్వారా ఉపాధి మార్గాలు పెంచవచ్చన్నారు.
కేంద్ర పథకాలను సమర్ధంగా అమలుచేసి మరింతగా నిధులు రాబట్టాలని, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావల్సిన నిధులు త్వరగా సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వనరుల వినియోగంలో వెనుకబడి ఉన్నామని, అలాగే ప్రభుత్వ విధానాలు దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో నిధులు ఖర్చు చేయాలని సూచించారు. వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించాలని, వంద శాతం విద్యుత్ కనెక్షన్లు, వంద శాతం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు.
రాష్ట్రాన్ని ఆక్వాకల్చర్‌లో దేశానికి, పాడిపరిశ్రమ, పశుగణాభివృద్ధిలో దక్షిణాసియాకు హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఈ దిశగా ప్రణాళికలు రచించామని ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ పేర్కొన్నారు. ఆక్వా కల్చర్, పశుగ్రాసం, పాడి, డ్రిప్ కల్టివేషన్, అగ్రిబిజినెస్, అంతర్‌పంటలుగా వరి, మొక్కజొన్న, వరి- పప్పు ధాన్యాల కాంబినేషన్లు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎంఎస్‌ఎంఇ, పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, గృహకల్పన, స్మార్టు ఎపి ఫౌండేషన్, పర్యాటక రంగం, సెర్ప్ విభాగాల్లో ల్యాబ్ వర్కుతో ఫోకస్ అప్రోచ్ అనుసరిస్తున్నామన్నారు. డిసెంబర్‌లో అన్ని శాఖల్లో ల్యాబ్ ట్రైనింగ్ లాంఛనంగా ప్రారంభిస్తామని టక్కర్ చెప్పారు. మత్స్యశాఖ, గృహ, వౌలిక సదుపాయాల కల్పనను గ్రోత్ ఇంజన్లుగా కేస్ స్టడీకి ఎంపిక చేసుకున్నామన్నారు. కొత్తగా 14వేల హెక్టార్ల పరిధిలో బ్రేకిష్ వాటర్ ఆక్వా కల్చర్‌ను, మరో 15వేల హెక్టార్ల పరిధిలో ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్‌ను విస్తరింపచేసే ఆలోచన ఉందన్నారు. మత్స్యశాఖ పునర్వ్యస్థీకరణకు, డికేటీ భూములు, పోరంబోకు భూముల్లో ఆక్వా కల్చర్‌పై విధానాల మార్పులను పరిశీలిస్తున్నామని, వ్యవసాయంతో పాటే చేపల చెరువులకూ నీటి సరఫరా, ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ సబ్సిడీలు, ఆక్వా కల్చర్‌కు అనుమతులు సులభతరం చేసే ప్రణాళికలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 62.54 లక్షల కుటుంబాలు పాడి పరిశ్రమ, పశు సంపదపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఆదర్శం ‘పెమాండు’
మలేషియాలో పెరఫార్మెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్ రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు. మలేషియా ప్రధాని స్వీయ పర్యవేక్షణలో అది పనిచేస్తోందని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఆ తరహా యూనిట్ ద్వారా రాష్ట్రంలోనూ అభివృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు.