ఆంధ్రప్రదేశ్‌

కట్టుకథలతో తప్పించుకోవద్దు: చంద్రబాబు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలగపూడి: అంటువ్యాధులు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సరైన చర్యలు తీసుకోవడానికి బదులు ఏవో కట్టుకథలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని ఎపి సిఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో అధికారులను హెచ్చరించారు. ఆయన శనివారం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫనెర్స్ నిర్వహించి, భారీ వర్షాల కారణంగా పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోందన్నారు. దీంతో అంటువ్యాధుల బారిన జనం పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అనంతపురంలో డెంగ్యూ వ్యాధితో ఇద్దరు పిల్లలు మరణించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీ ఇంట్లో ఎవరైనా జబ్బు పడితే మీరు ఎలా బాధ పడతారో- మీ ఊళ్లో వ్యాధులు వ్యాపించినా అలాగే స్పందించాలి..’ అని సిఎం అన్నారు. ఇకపై ప్రతి శనివారం పరిశుభ్ర దినంగా పాటించాలని ఆదేశించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా సంబంధిత అధికారులు చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. అంటువ్యాధుల కారణంగా మరెక్కడా మరణాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.