బాహుబలి-2 విడుదల తేదీ ఖరారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమా బాహుబలి ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇక ఆ సినిమా రెండో భాగం ‘బాహుబలి-ది కంక్లూజన్’ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను 2017 ఏప్రిల్ 14న విడుదల చేస్తారని ప్రముఖ సినీ విశే్లషకుడు తరణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘బాహుబలి ది బిగినింగ్’ సినిమా క్లైమాక్స్‌లో కథానాయకుడు బాహుబలిని కట్టప్ప హతమారుస్తారు. బాహుబలి కుటుంబానికి వీరవిధేయుడైన కట్టప్ప అలా ఎందుకు చేశాడో అర్థంకాదు. ఈ సన్నివేశంతో కథ ముగుస్తుంది. ఇక కట్టప్ప ఎందుకలా చేశాడో తెలియాలంటే రెండోభాగం చూడాల్సిందే. అందుకోసం వచ్చే ఏడు ఏప్రిల్ 14వ తేదీ వరకూ ఆగాల్సిందే. ఈ సినిమా బాక్సాఫీసులో సునామీ సృష్టించబోతోందంటూ తరణ్ వ్యాఖ్యానించడం విశేషం.