భక్తి కథలు

ఆత్మ ఉనికి చైతన్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు

7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079

పరతత్త్వములో భగవంతుడే చివరి తత్త్వముగా చెప్పబడింది. పరతత్త్వము, బ్రహ్మము లేక సర్వవ్యాపకమైన, నిరాకార తత్త్వముగను, పరమాత్మ సర్వజీవుల హృదయములయందు నివాసముండే విశిష్టరూపుడుగను, భగవానుడు, లేక దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిగను, మూడు విధములుగా అనుభవమగును. పరతత్త్వము యొక్క లక్షణము గురించి శ్రీమద్భాగవతములోని ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలించండి.
శ్లో ‘‘వదన్తిత తత్త్వ విస్తత్త్వం యత్ జ్ఞనమద్వయమ్
బ్రహ్మేతి, పరమాత్వేతి, భగవానితి శబ్ద్యతే
భావార్థము:పరమ సత్యమెరిగినవానిచే, ఆ పరమ సత్యము, మూడు విధముల యనుభూతి చెందును. ఆ మూడు దశలు వరుసగా బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని వ్యక్తము చేయబడును. ప్రత్యక్షోదాహరణ ద్వారా చెప్పవలయునన్నచో, పైన చెప్పినప్న మూడు దివ్యాంశములను, సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యగ్రహములోపల జరుగు వివిధ క్రియలు ఒకదానికొకటి వేరుగాదని తెలియవలెను. అయినను పై మూడు దశలను గురించి అధ్యయనము చేయువారిని ఒకే స్థితిగల వారిగా నిర్ణయించలేము. ‘్భగవాన్’ అను శబ్దము చేయువారిని ఒకే స్థితిగల వారిగా నిర్ణయించలేము. ‘్భగవాన్’ అను శబ్దము శ్రీ పరాశర మహర్షిచే వివరింపబడిన దానిననుసరించి సర్వసంపదలను, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వజ్ఞానమును, సర్వసౌందర్యమును, సంపూర్ణ వైరాగ్యమును గల పరమ పురుషుడు, భగవానుడనబడును. సర్వకారణములకును సంగరహితము అయిన పరబ్రహ్మము నాశ్రయించియున్న మూలశక్తిని ‘ఆవరణ శక్తి, విక్షేపశక్తి’ అని రెండు విధములుగా చెప్పిరి. అట్టి సత్యవస్తు శక్తి, ఆవరణ శక్తితో తనకు ఆశ్రయమైన అద్వితీయమైన ఆత్మను కప్పివేసి విక్షేప శక్తితో వ్యక్తమై, మనస్సును పేరుతో విస్తరిస్తోంది. అట్టి శక్తి, తన విలాసముచే, నామరూపములుగా విభాగము చెందును. ఈ విషయాన్ని గురించి వశిష్ట మహర్షి శ్రీరామచంద్రునకు సవివరంగా చెప్పారు.

సర్వశక్తిమయం బ్రహ్మ, నిత్యమాపూర్ణమద్వయమ్
న, తదస్తిన, యత్తస్మిన్, విద్యతేవితతాత్మని
భావము: శాశ్వతము, సంపూర్ణము, అద్వితీయమునగు బ్రహ్మము సర్వశక్తి సంపన్నము, సర్వవ్యాపకమునయిన నా బ్రహ్మమునందు లేనిది లేదు. తరువాతి శ్లోకంలో-
యయోల్లసతి శక్త్యా సౌ, ప్రకాశమధి గచ్ఛతి
ఛిచ్ఛక్తిద్బ్రహ్మణో, రామ శరీరేషూపలభ్యతే
భావము:శ్రీరామా, ఏ శక్తిచేత పరమాత్మ ప్రకాశించుచు ఈ ప్రకృతి (సమస్త జీవులతో కలిసి) ద్వారా బహిర్గతమగుచున్నదో, ఆ బ్రహ్మము యొక్క చైతన్యము మన శరీరములనుండియు బహిర్గతమగుచున్నది. ఇంకను ఆ పరబ్రహ్మ చైతన్యము.
స్పన్దశక్తిశ్చవాతేషు, ధార్‌ధ్యశక్తి స్త్ధోపలే
ద్రవశక్తి స్త్ధా మ్భస్సు దాహశక్తిస్త్థా నలే
భావము:ఆ పరబ్రహ్మ యొక్క శక్తి వాయువునందు, చలనశక్తిగాను, శిలయందు, కాఠిన్యశక్తిగాను, నీటియందు ద్రవశక్తిగాను, అగ్నియందు దహనశక్తిగాను రూపుదాల్చియున్నది.
శూన్యశక్తి స్త్ధా కాశే, నాశశక్తిర్వినాశిని
యథా ణ్దాన్తర్జలే బర్హి స్సూక్ష్మరూపేణ విద్యతే
ఫల పుష్పలతా పత్ర శాఖావిటప మూలవాన్
వృక్ష బీజే యధావృక్షస్త ధేదం బ్రహ్మణి స్థితమ్
భావము:ఆ పరబ్రహ్మ శక్తి ఆకాశమునందు శూన్యశక్తిగాను, నశింపచేయుశక్తిగాను నిక్షిప్తమై యున్నది. మరియు బ్రహ్మాండము లోపలి నీటియందు అగ్ని సూక్ష్మ రూపములో నున్నట్లు గాను, ఫల పుష్ప శోభితమైన వృక్షము, ఆ వృక్షము తాలూకు బీజమునందు నిక్షిప్తమనట్లుగాను, ఈ విశ్వమంతయును బ్రహ్మమునందున్నది. దేశ కాల వైవిధ్యముచేత, భూమి నుండి పైరువలె, కొన్ని కొన్ని శక్తులు ఉద్భవించుచున్నవి. ఇంకను వశిష్ఠ మహర్షి యిట్లు చెప్పెను.
ఆత్మాసర్వగతోరామ! నిత్యోదిత మహావపుః
యన్మనాఙ్మననీం, శక్తిం ధత్తే తన్మన ఉచ్యతే
పరస్మాత్ కారణాదేవ మనః ప్రధమముద్దితమ్
మననాద్వ్యక్త ‘మేవేదం’ ‘తేనేదం, కల్ప్యతే జగత్’
భావము:ఓ రామా! ‘ఆత్మ’ సర్వగతము, నిరంతరము, నిరంతరముద్భవించు అనేక దేహములు కలది. కొంచెమాలోచించు శక్తిగలిగినదగుటచే ‘మనస్సు’ అందరు. ఈ మనస్సు మొదటగా పరమకారణమైన పరబ్రహ్మము నుండియే ఉద్భవించుచున్నది. ఆలోచించు శక్తిచేత రుూ మనస్సు స్పష్టమైనదే, దానిచేత రుూ విశ్వము కల్పించబడుచున్నది.
భగవద్గీత యందలి రెండవ అధ్యాయమున పరమాత్మ, జీవాత్మ తత్త్వముల గురించి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునొక మిషగా పెట్టుకొని, లోకానికి తెలియజేశారు. అట్టి శ్లోకములు కొన్నింటినిచ్చట పరిశీలిద్దాము.
దేహినో స్మిన్ యధాదేహే కౌమారం వవ్వనం, జరా
తధా, దేహాన్తర ప్రాప్తిర్దిరస్తత్రనమహ్యాతి
భావము:బద్ధజీవుడు (జీవాత్మ) అవిచ్ఛిన్నముగా ఈ శరీరమునందు, బాల్యము, యవ్వనము, ముసలితనము పొందుచున్నట్లుగానే, జీవాత్మ కూడా మరణానంతరం వేరొక దేహమును పొందును. కావున ధీరుడైనవాడు, యిట్టి విషయమై మోహమునందడు. ఇచ్చట, ధీరుడనగా, జీవాత్మ, పరమాత్మ, భౌతిక, ఆధ్యాత్మిక, ప్రకృతులకు సంబంధించిన జ్ఞానము పూర్తిగా కలిగినవాడని అర్థము. అట్టివాడు, శరీరముల మార్పు చేత మోహమును పొందడని అర్థము.
అవినాశి, తు, తద్విద్దియేన, సర్వమిదం, తతం
వినాశమన్యయస్యాస్యనకశ్చిత్, కర్తుమర్హతి
భావము:శరీరమంతటా వ్యాపించి యున్న ఆత్మ నాశనము లేనిదని గ్రహించవలెను. అట్టి ఆత్మనెవ్వరును నశింపజేయజాలరు. ఈ శ్లోకము, శరీరము నందంతటను ఆత్మ వ్యాపించి యున్నదని చెప్పుటచే, ఆత్మయే చైతన్యమని తెలియుచున్నది. పూర్తిగా కాని, అంశముగా కాని శరీరము పొందే సుఖ దుఃఖములందరికి తెలిసినవే. చైతన్యము యొక్క వ్యాప్తి శరీరాంతర్భగమునకు మాత్రమే పరిమితమైయున్నది. కావున ఒక శరీరము పొందే సుఖ దుఃఖములు వేరొక శరీరమునకు తెలియవు (అనుభూతిలోనుండవు) అందువలన ప్రతీ శరీరము కూడ ఒక జీవాత్మ యొక్క ఆచ్ఛాదనమే (కప్పివుంచునదే)నని తెలుస్తోంది. శే్వతాశ్వతరోపనిషత్తు ఆత్మయొక్క పరిమితినట్లు తెలియజేసింది. ఈ శ్లోకాన్ని పరిశీలించండి.
‘‘వాలాగ్రశత భాగస్య, శతధాకల్పితస్య చ
భాగోజీవః స విజ్ఞేయః స, చానన్త్యా కల్పతే’’
భావము:కేశాగ్రమును వంద భాగములుగా విభజించి, మరల ఒక్కొక్క భాగమును వందేసి భాగములుగా విభజించినచో అది ఎంత పరిమితి కలిగియుండునో ‘ఆత్మ’ అంత పరిమాణము కలిగియుండును. ఇంకను యిట్లు చెప్పబడినది.
కేశాగ్రశత భాగశ్య, శతాంశః సాదృశాత్మకః
జీవఃసూక్ష్మ స్వరూపో యం సంఖ్యాతీతోహి చిత్కణః
అనగా, తల వెంట్రుకలో పదివేల భాగమంత పరిమితిగల, ఆధ్యాత్మికములైన అణువుల సంఖ్యాకముగా గలవు. అందుచేత, ఆత్మయొక్క ప్రతి కణమును, భౌతికమైన అణువునకంటె చిన్నదై, ఆధ్యాత్మిక అణువుగా నుండును. అట్టి అణువుల సంఖ్యాకములు. ఇట్టి అతి చిన్నదైన తేజోకణమే, మన భౌతిక శరీరమునకు, మూల సిద్ధాంతముగానున్నది. ఔషధము యొక్క ప్రభావము శరీరమంతటా వ్యాపించినట్లు, ఈ తేజఃకణము ఆత్మయొక్క ప్రభావము, శరీరమందంతటను చైతన్య రూపమున వ్యాపించియుండును. అదియే ఆత్మ ఉనికికి నిదర్శనము. ఇంకావుంది...