బాల భూమి
దూరాలోచన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అప్పుడే బడిలో ఆఖరి గంట కొట్తారు. పిల్లలంతా ఇంటికి వెళ్లిపోవచ్చనే సంతోషంతో హడావిడిగా అటూ ఇటూ పరుగులెత్తుతున్నారు.
తన పుస్తకాల సంచీ తీసుకుని తరగతి గది నుండి బయటకి వచ్చాడు గోపి.
గోపి అంతకు రెండు రోజుల ముందే వేరే ఊరి నుండి వచ్చి ఈ బడిలో చేరాడు. కొత్తగా చేరటంతో గోపికి ఎవ్వరూ పెద్దగా స్నేహితులు కాలేదు. అందుకే మెల్లగా తరగతి గది నుండి బయటకి వచ్చి ఆటస్థలం వైపు నడుస్తూ పిల్లల ఆటల్ని చూడసాగాడు. ఇంతలో దూరంగా కింద పడి ఉన్న అరటి పండు తొక్క అతనికి కనపడింది. ఆ పక్కనే పరుగులెత్తుతూ ఆడుకుంటున్న పిల్లలు కనపడ్డారు. భయంతో గోపి వొళ్లు జలదరించింది. గబగబా అటుగా పరిగెత్తాడు.
గబుక్కున వెళ్లి అక్కడ పడి ఉన్న అరటిపండు తొక్కను చేత్తో తీసి దగ్గరలో ఉన్న చెట్టు మొదట్లో వేసి వచ్చాడు. ఇదంతా దూరం నుండి గమనించిన ప్రధానోపాధ్యాయుల వారు గోపిని పిలిచారు. వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు గోపి.
‘ఏమిటి నువ్వు చేసిన పని?’ అని అడిగారు.
‘అరటిపండు తొక్క అక్కడ పడి ఉంది. తీసి చెట్టు మొదట్లో వేసానండి’ అన్నాడు.
‘అదే అడుగుతున్నాను. ఎందుకు తీసావు?’ అన్నారు ప్రధానోపాధ్యాయుల వారు.
‘ఏమైనా తప్పు చేశానా?’ అనిపించింది గోపికి. కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు.
‘అయ్యా!.. అరటిపండు తొక్క ఎవరో అక్కడ పడేసారు. అలా పడెయ్యద్దు అని చెబితే వాళ్లు వినరు. నువ్వు చెప్పేదేమిటి అని మళ్లీ వేస్తారు. అలా కాకుండా దాన్ని నేనే తీసి వేస్తే వాళ్లు చూసి నేర్చుకుని మరెప్పుడూ వెయ్యకుండా ఉంటారు.
అంతేకాదండి. అరటి పండు తొక్కకీ మనసు ఉంటుంది. అది ఇప్పటిదాకా మన కోసం ఒక పండుని రక్షించింది. దానిని ఎండ నుంచీ, వాన నుంచీ కాపాడి మరీ మనకు ఆహారాన్ని అందించింది. ఇప్పుడు దానికి చివరి దశ. ఎవరైనా తొక్కితే ‘ఇందుకేనా నేను మీ కోసం ఇంత కష్టపడింది’ అని తిట్టుకుంటుంది. పైగా దానిని ఎవరైనా తొక్కితే ఆ తొక్కిన వాళ్లు జారిపడిపోయి ప్రాణం పోయినా పోవచ్చు. దానే్న తీసి మొక్కల్లో వేస్తే మొక్కలకి ప్రాణం పొయ్యచ్చు. అందుకే దాన్ని తీసేసి మొక్కల మొదట్లో వేసానండి..’ అన్నాడు గోపి.
ప్రధానోపాధ్యాయుల వారికి గోపి చెప్పింది విని ఎంతో సంతోషం వేసింది.
‘మంచివాడివి. ఇదే చదువంటే. నువ్వు మా బడిలో చేరటం మా బడికే గర్వకారణం. ఈ రోజు నుండి నిన్ను మన బడి విద్యార్థులందరికీ నాయకుడిగా నియమిస్తున్నాను..’ అంటూ భుజం తట్టారు ప్రేమగా.
సంతోషంగా ఇంటిదారి పట్టాడు గోపి.