బాల భూమి

బ్రహ్మసృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదొక గ్రామం. దాని పేరు బ్రహ్మపురి. పల్లెలు పట్టుగొమ్మలు దేశానికి అన్న ఒక మహానుభావుని పలుకులు బంగారు గుళికలు. నిజంగా పల్లెటూరి వాతావరణం చెప్పుకోవలసింది. నగరాలు విడచి పల్లెకి ఒకసారి వచ్చిన వారు తిరిగి పట్నాలకి వెళ్లలేరు అనటంలో అతిశయోక్తి లేదు. చల్లని ప్రకృతి. చక్కటి గాలి. పచ్చని పొలాలు. సెలయేళ్లు. ఎతె్తైన కొండలు. వాటిని తాకుతున్న నల్లని మేఘాలు. ఆరోగ్యానికి, ఆనందానికి, ప్రశాంతతకి, అనుభూతికి ఆలయాలు పల్లెటూళ్లు. పాడి పంట సమృద్ధిగా లభించే కల్పవృక్షాలు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్నేహశీలత పంచే అమృత హృదయాలు కల మనుషులు. కుల మత భేదాలు, హెచ్చుతగ్గులు, జాతి వైషమ్యాలు కానరావు.
ఒక సెలయేరు ఒడ్డున పెద్ద రావిచెట్టు. రావిచెట్టు మొదట్లో బ్రహ్మరూపం, మధ్యలో విష్ణు రూపం, చివరి భాగంలో శివరూపం ఇమిడి వుంటాయి. దానికి మూలలో ‘బ్రహ్మ రూ పాయ, మధ్యలో విష్ణు రూపాయ, అగ్రస్థ శివ రూపాయ’ అనే మంత్రం నిబిడీకృతమై ఉంది. ఆ రావిచెట్టు మొదట్లో నీళ్లు పోసి ఓ నమస్కారం చేస్తే త్రిమూర్తులు ఆశీర్వదిస్తారంటారు. ఆ రావిచెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారనటం పచ్చి నిజం.
ఆ చెట్టు పక్క ఒక ముసలాయన కూర్చున్నాడు. పండు ముసలి. మొహంలో వృద్ధాప్య ఛాయలు, బారెడు గడ్డం, భుజంపై తువ్వాలు, నడుంకి లుంగీ పంచె. చేతిలో ఏవో దారాలున్నాయి. ప్రక్కనే కర్ర. నోటితో మంత్రోచ్ఛారణ చేస్తున్నాడు. చేతిలో దారాలు రంగురంగులవి ఒకదానికొకటి కలిపి ముడివేసి సెలయేట్లో విడిచిపెడ్తున్నాడు. అవి ఆ సెలయేటి ప్రవాహంలో ప్రయాణించి వెళ్లిపోతున్నాయి.
దూరంగా పశువుల్ని కాస్తున్న ఓ కుర్రాడు.. ఓ రాయితినె్నపై కూర్చుని లొల్లాయి పదం పాడుకుంటూ ముసలి తాత చేస్తున్న పని కుర్రాడికి అర్థం కాలేదు. చాలాసేపట్నించి నోరు ఆడించటం, చెయ్యి నీటిలోకి వెయ్యటం గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నాడో, దేనికలా చేస్తున్నాడో అర్థంకాలేదు. అదేమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. మెల్లగా లేచి ముసలాయన వద్దకు చేరి ‘తాతా! తాతా! ఏం చేస్తున్నావ్?’ చేతిలో కర్ర భుజంపై వేసుకుని అడిగాడు.
‘తెలుసుకోవాలా?’ ప్రశ్నించాడు తాత.
‘ఆఁ! నువ్వేం చేస్తున్నావో అర్థం కావటం లేదు. అదేంటి? నోరు ఆడిస్తున్నావ్? చెయ్యి విదిలిస్తున్నావ్?’ ఏమిటిది?’
‘ఇది సృష్టి రహస్యం. ఇవి రంగురంగుల దారాలు. వీటిని ఒక రంగుతో మరొకటి రంగు కలిపి కట్తున్నాను. అంటే అది ఆడామగా కలయిక. భార్యకి భర్త, భర్తకి భార్య అన్నమాట. మంచివాళ్లు స్నేహపాత్రులు, దుష్టులుని సృష్టిస్తున్నాను. మానవులకి మనస్తత్వాలు నింపుతున్నాను’ అని సమాధానం ఇచ్చాడు.
‘కొయ్ కొయ్! నమ్మమంటావా? నువ్వు బ్రహ్మవా.. సృష్టించటానికి?’ ప్రశ్నించాడు.
‘బ్రహ్మనే! నిజం చెప్పినా నమ్మరీ మూర్ఖ మానవులు! చూడు’ అంటూ గొల్లపిల్ల వాని నెత్తిపై చెయ్యి వుంచాడు బ్రహ్మ.
రంగురంగుల దృశ్యాలు. తాత కలిపిన దారాలు నల్లదారంతో తెల్ల దారం, నల్ల మొగుడుతో తెల్ల భార్య, తెల్ల పిల్లతో చామనచాయ అబ్బాయి, ఎరుపు అబ్బాయితో నల్లని అమ్మాయి వివాహాలు చేసుకుంటున్నారు. దుష్టులు, దుర్మార్గులు, మంచి మనసులు, త్యాగధనులు, అపకారికి ఉపకారం చేసే వారు, స్నేహపాత్రులు, కలివిడి మనసులు రకరకాల వాళ్లు కళ్ల ముందు కనిపించారు. తెల్లబోయాడు. మరుక్షణం అంతా మరచిపోయాడు. మరుక్షణం ‘నాకెందుకు? నీ పనికి అంతరాయం! నే వెళ్లొస్తాను’ మాట్లాడకుండా వెనుదిరిగెళ్లిపోయాడు గొల్ల పిల్లవాడు.
సాక్షాత్తు బ్రహ్మ, తనలో తను నవ్వుకుని చేసుకుంటున్న పనిలో నిమగ్నమయ్యాడు.

-జి.యస్.కె. సాయబాబా