భాస్కర వాణి

దేశంలో ఇంతమంది మేధావులా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటి అమెరికా అధ్యక్షులు జిమీకార్టర్, పూర్వాధ్యక్షులు ఫోర్డ్, హేన్రీకిసింజర్, ఓ క్యాథలిక్ ఫ్రీస్ట్, ఓ అమెరికన్ హిప్పీ ఎరోప్లేన్‌లో ప్రయాణం చేస్తున్నారు. హఠాత్తుగా తుఫాను రావడంతో పైలట్ ప్రయాణికులకు సూచన మొదలుపెట్టాడు. ‘‘మన విమానంపై పిడుగుపడి కో-పైలట్ చచ్చిపోయాడు. ప్లేన్ కూలనుంది. ఇవిగో నాలుగు పారాచూట్‌లు ఉన్నాయి. మీరు ఎలా ఎవరు వాడుకొంటారో మీ ఇష్టం’’అంటూ తాను పారాచూట్ వేసుకొని దూకేశాడు. ఇప్పుడు నాలుగు పారాచూట్‌లు; ఐదుమంది ప్రముఖులు. చర్చ మొదలైంది. ప్రెసిడెంట్ కార్టర్ ‘‘స్వేచ్ఛా ప్రపంచపు బరువుబాధ్యతలు నాపై ఉన్నాయని మీకు తెలుసు’’అంటూ ఓ పారాచూట్‌తో దూకేశాడు. వెంటనే ఫోర్డ్ ‘‘నేను జన్మలో ఎవరికీ హాని చేయలేదు. అంతేగాక ఒకరికి గోల్ఫ్ ఆడేందుకు తేదీ నిర్ణయించేసాను’’అంటూ అతడు ఓ పారాచూట్‌తో దూకాడు. ఆ తర్వాత హేన్రీకిసింజర్ ‘‘నా అంత మేధావి ఈ ప్రపంచంలో ఎవరూ లేరని మీకు తెలుసు; నేను ఈ లోకానికి తక్షణావసరం’’ అంటూ ఆలోచించకుండా దూకేశాడు. క్యాథలిక్ ఫ్రీస్ట్ హిప్పీకి చెప్తూ ‘‘నాయనా! నా జీవితాన్ని ప్రభువుకే అర్పించాను. ఆ చివరి ప్యారాచ్యూట్ తీసుకొని నీవు దూకెయ్’’ అన్నాడు.
కానీ విచిత్రంగా రెండు ప్యారాచూట్‌లు మిగిలిపోయాయి. ‘‘్ఫదర్! అతి తెలివిగల కిసింజర్ తొందరలో ప్యారాచ్యూట్ అనుకొని నా బ్యాగ్ తగిలించుకొని వేగంగా దూకేశాడు’’ అనగానే ఫ్రీస్ట్ నాలుక్కరచుకొన్నాడు. మేధావుల స్థితి ఎంత తొందరపాటుగా, తెలివి తక్కువగా ఉంటుందో అని రజీనీశ్ చెప్పిన కథ. ఇపుడు మన దేశంలో మేధావులు అనబడేవాళ్ల దుస్థితి ఇలాగే ఉంది. ఇటీవల ‘‘మూకుమ్మడి ప్రకటన’’ ఇచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. వాళ్లు దేశంలో జరిగే ప్రతి సంఘటనా ఖండిస్తారు. వీళ్లంతా వివిధ హోదాల్లో ఈ దేశంలో పదవులు వెలగబెట్టినవారే. పదవీ విరమణ పొందిన జడ్జిలు, రిటైర్ అయిపోయిన ఐఏఎస్‌లు, అవార్డులు పొంది ముక్కిమూలుగుతున్న కవి పుంగవులు, వాట్సాప్ కూడా వాడకం రాని ఎర్ర మేధావులు, పత్రికా ప్రకటనల్లో తమ పేరుచూసి మురిసిపోయే చీఫ్ పాపులర్‌గాళ్లు, దశాబ్దాలనుండి కవులుగా వెలగబెడుతూ కవితా లోకంలోనీ సంసృష్టించిన గోడమీది పిల్లులు.. సినిమాల్లో ఛాన్స్‌లు లేక జన నాట్యమండలిలో, ప్రజానాట్య మండలిలో పొందిన శిక్షణను ఇతరులమీద వాంతి చేసుకొనే రోగిష్టులు, ప్రతీ అక్షరాన్ని ‘కులం కుళ్లు’లో ముంచి అక్షరాలు గీసే (క)కులవాదులు ‘దేశంలో ఏమైపోతుందో అంటూ గగ్గోలు పెడుతున్నారు. వాళ్లకుతోడు ఇటీవల ఓ స్వయం ప్రకటిత శాస్తవ్రేత్తల బ్యాచ్ ఒకటి తయారయ్యింది. వాళ్లు ఏం పరిశోధించారో, ఎక్కడ పరిశోధించారో... అసలు ఈ వందల మంది శాస్తవ్రేత్తలు కనుగొన్న క్రొత్త మూలకాలు ఏంటో తెలియడం లేదు. ఇంతమంది శాస్తవ్రేత్తలు ఉన్న ఈ దేశంలో క్యాన్సర్‌కు లేకపోవచ్చు గానీ కనీసం కామెర్లకు కూడా ‘మందులు లేవు’ అదేం చిత్రమో..!?
గో విసర్జకాలను ప్రోత్సహించాలని ఫిబ్రవరి 14న కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ నిర్ణయం తీసుకొన్నది. దీనిపై ఒంటికాలిపై లేచిన ‘‘ఈ పరిశోధన దండగ’’ అంటూ కేంద్రానికి 500 మందికి పైగా శాస్తవ్రేత్తలు లేఖ రాసారట! థామస్ అల్వా ఎడిసన్ నోట్లోంచి ఊడిపడిన ఈ శాస్తవ్రేత్తలెవరో అసలు పరిశోధన జరపాలి. ఇటీవల లేఖలు రాయడం, అవార్డులు రాగానే వాటిని ‘వాపస్’ ఇవ్వడం- మళ్లీ పేరుపొందడం ఓ ఫ్యాషన్ అయ్యింది. ఈ గ్యాంగ్ లక్ష్యం ఒక్కటే. ఈ దేశానికి మంచి జరుగొద్దు!? పోనీ వీళ్లు ఇంత గొప్ప పరిశోధకులయినపుడు గోవుపై ఏమైనా పరిశోధన చేసారా! అంటే అదీ లేదు. ఎవరైనా విదేశీ, స్వదేశీ శాస్తవ్రేత్తలు చేసిన పరిశోధన గురించి వాళ్లకేమైనా తెలుసా! అంటే శూన్యం. కేవలం గ్రుడ్డిగా ఈ దేశ ‘ప్రాచీనతను’ అవమానించడం అనుమానించడం తప్ప ఇంకేదీ వాళ్ల లక్ష్యం కాదు.
మానవులను నిత్యరోగులుగా మార్చుతున్న వైద్యం, తినే తిండి, గాలి, నీరు, భూమి అన్నీ కలుషితంచేస్తున్న ‘సైన్సు’ తప్పు అంటూ మొత్తానికి మొత్తం తిరస్కరించడం ఎంత తప్పో ‘్భరతీయతను మొత్తం వ్యతిరేకించడం’’ అన్న లక్ష్యాన్ని మనస్సులో పెట్టుకొని ప్రతీది వ్యతిరేకించడం అంతే తప్పు. వంచన సంబంధాలను నిర్వీర్యంచేస్తూ, యాంత్రికంగా మనిషిని మార్చేసి, సృజనాత్మకతను చంపేస్తున్న మితిమీరిన శాస్తజ్ఞ్రానం ఈ జాతికి అవసరమా? గోమూత్రం ఇంధనంగా పనికి వస్తుందని జార్జ్‌డేవిడ్ అనే వ్యక్తి తమిళనాడులోని ఓ కుగ్రామంలో నిరూపించాడు. గోబర్ గ్యాస్‌ను వాడుతున్న సమయంలో అతనికి ఇలాంటి అనుభవం ఒకటి కలిగింది. అలాగే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంనుండి పిహెచ్‌డి పూర్తిచేసిన కువర్‌జి భాయ్‌యాదవ్ రాజ్‌కోట్ దగ్గర ‘బాట్లింగ్ ప్లాంట్’ ఏర్పాటుచేసి ఆవుపేడ ద్వారా ‘‘కంప్రెస్డ్’’ బయోగ్యాస్ ఎలా తయారుచేయవచ్చో కొంత ముందుకు వెళ్లాడు. ఇక బాబా రామ్‌దేవ్ నడిపిస్తున్న పతంజలి సంస్థ గోవ్యర్థాలతో ఏమిచేయవచ్చో పరిశోధన మొదలుపెట్టింది. ఇదంతా వ్యక్తిగతంగా జరుగుతున్నది. దానిని ప్రభుత్వం ఓ ఆలోచనగా స్వీకరిస్తే వీళ్లకు నొప్పేమిటీ! అందులో తప్పేమిటీ?!
ఇటీవల షాహీన్‌బాగ్‌లో ఓ ముస్లిం నాయకుడు మాట్లాడుతూ ‘‘గోఉత్పత్తులు ఇస్లాంకు విరుద్ధం; బాబా రాందేవ్ ఉత్పత్తులు మనం కొనడానికి వీల్లేదు’’అన్నాడు. అలాగే ‘‘మనమంతా రిలయన్స్ వారి జియో కనెక్షన్ వదిలేసి ఇతర నెట్‌వర్క్‌లు వాడాలని’’చెప్పాలి. ఈ మూర్ఖపు వాదనకూ, ఈ శాస్తవ్రేత్తల గ్యాంగ్ వాదనకూ ఏమైనా భేదం ఉందా? ఒకవేళ హిందువులు మిగతా మతాల వాళ్లవద్ద కొనడం మానేస్తే!? అప్పుడు ఏం జరగనుంది? వాళ్లకు ఏ బుద్ధిపుడితే అది మాట్లాడడం అలవాటుగా పెట్టుకొన్నారు. మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం ఇచ్చిన కబీర్ సమ్మాన్ పురస్కార్ పొందిన ఓ కవీశ్వరుడు సీఏఏ తప్పంటూ స్టేట్‌మెంట్ ఇస్తాడు. హక్కుల సంఘాల పేరుతో అరాచకం సృష్టించి పోలీసులను విలన్లుగా చూపించే మేధావులే ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నట్లు గర్వంగా వ్యాసాల్లో రాసుకుంటారు. ‘‘గజబి- ఏ హింద్’’ పదానికి అర్థంకూడా తెలియని చరిత్రకారులు, కవులు, మేధావులు, సినిమావాళ్లు ఉన్న ఈ దేశంలో వాళ్ల అజ్ఞానం అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. ప్రణయ్‌ను హత్య చేయించాడని మారుతీరావును ఉరితీయాలని ర్యాలీలు తీసేవారే. దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను తప్పుపడుతుంటారు. యువకులందరినీ రాజ్యానికి వ్యతిరేకంగా తిరగబడమనేవాళ్లు తమ కొడుకులను అదే రాజ్యాన్ని కాళ్లక్రింద పెట్టుకొన్నవాళ్ల కాళ్లదగ్గర దాసోహం అనిపిస్తారు. ఇదంతా రెండు నాల్కల ధోరణి కాదా?
17వ శతాబ్దంవరకు ‘పాదరసం’ అంటే ఏమిటో పాశ్చాత్యులకు తెలియదు. కానీ 11వ శతాబ్దంలో మన దేశానికి వచ్చిన అల్బెరూనీ మన దేశంలో పాదరసం ఎలా తయారుచేస్తారో రాశాడు. నాల్గవ శతాబ్దంలోనే త్రుప్పు పట్టని ‘గరుడస్తంభం’ న్యూఢిల్లీ కుతుబ్‌మినార్ ప్రక్కన ఉంది. విద్యావాచస్పతి పండిత మధుసుదన సరస్వతి తన ‘ఇంద్ర విజయం’లో పేర్కొన్న ఋగ్వేద మంత్రాల్లోని 36వ సూక్తం ‘విమానవర్ణన’ చేసింది. ఇలా భారతదేశంలో ప్రాచీన విజ్ఞానం ఎంతో ఉంది. అంతెందుకు! సాధారణ విద్య చదువుకొన్న గంగుల శాయిరెడ్డి రాసిన ‘వర్షయోగం’ అనే పుస్తకంలో అనేక వైజ్ఞానిక విషయాలు ఉన్నాయి. కానీ హిందూ సంస్కృతి నుండి రానటువంటి శాస్త్రాలే ఈ గ్యాంగుల దృష్టిలో అద్భుతాలు. విచిత్రం ఏమిటంటే ఇటీవల ‘తుక్డేతుక్డే గ్యాంగు’లో శాస్తవ్రేత్తల పేరుతో జనాల్ని భ్రమపెట్టే స్టేట్‌మెంట్స్ ఇవ్వడం దారుణం. డా.సి.వి.రామన్, డా.ఏ.పి.జె అబ్దుల్ కలాం కన్నా ఎక్కువగా ఊహించుకొంటున్న వీళ్లు జాతి వ్యతిరేక శక్తులకు ఊతమిస్తూ ఈ దేశ సంస్కృతి, నాగరికతల పట్ల అణుమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించడం చూసి ఓ చిరునవ్వు నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయగలం.

- డా. పి. భాస్కరయోగి bhaskarayogi.p@gmail.com