భాస్కర వాణి

అసలు రంగు బయటపడింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ తన మిస్సైల్స్‌కు తైమూర్, అబ్దాలీ వంటి నరరూప రాక్షసుల పేర్లు పెట్టుకున్నది. హిందూస్తాన్‌లో విలయ విధ్వంసం సృష్టించిన మహమ్మద్ ఘోరీ పేరును తన క్షిపణులకు నామకరణం చేసింది. అలాగే కాంగ్రెస్‌ను వెనుకనుండి నడిపించే గులాం నబీ ఆజాద్ తన కొడుకుకు ఔరంగజేబు అని పేరు పెట్టుకొన్నాడు. ఈ నబీ కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ నుండి ‘క్యాబ్’ బిల్లుపై రగడ చూసాక ఇంతకన్నా ‘ఇంకేం చూస్తాం’ అనిపిస్తుంది. క్యాబ్ బిల్లు చట్టబద్ధంగా పార్లమెంట్‌లో పాస్ అయ్యాక ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అంటూ శివాలెత్తుతున్న సోనియా అండ్ కో సూడో సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్టులు, కొన్ని ఇస్లామిక్ సంస్థలు, పార్టీలు రాజ్యాంగం గురించి మాట్లాడడం విడ్డూరం. అంటే ఇప్పటినుండి ఏ బిల్లు అయినా పార్లమెంట్ ఆమోదించినా, ఆమోదించకున్నా బస్సులను తగులబెట్టి కొన్ని మత విశ్వవిద్యాలయాల్లో ఆందోళన చేసి ఆమోదించుకోవాలని వాళ్లు సందేశం ఇస్తున్నారా? 4 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు తమ స్వంత స్థలాలను వదలిపెట్టి అత్యాచారాలకు గురై పుట్టకొకరు, చెట్టుకొకరు అయినపుడు ఇదే గులాం నబీ ఆజాద్ ‘దేశ సెక్యులరిజం ప్రమాదంలో పడిందని’ నోరు విప్పదే? అస్సాంలోకి బంగ్లా చొరబాటుదారులు కుప్పలు తెప్పలుగా వచ్చి అక్కడ స్థానికులను ఊచకోత కోస్తుంటే ఇదే కపిల్ సిబ్బల్ కళ్ళు మూసుకున్నాడా? మయన్మార్ నుండి రోహింగ్యాలు వచ్చి అక్కడి స్థానిక హిందువులను చంపి బొంద పెడుతుంటే డిగ్గీరాజా ఎక్కడున్నాడు? ఇక ఈ దేశ కమ్యూనిస్టులు కళ్లున్న కబోదులు. వాళ్ల వంధిమాగధ చరిత్రకారులు, రచయితలు ‘తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దే’ కృతజ్ఞతాహీనులు. అసలు ఇపుడు జరుగుతున్న ఆందోళన ‘క్యాబ్’ బిల్లును వ్యతిరేకించేందుకు కాదనిపిస్తుంది. త్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, రామమందిరం తీర్పు.. ఇవన్నీ హిందువులకు సంతోషం కలిగిస్తే ఈ గుంపును రెచ్చగొట్టాయి. అందుకే వీటన్నిటికి సంబంధించిన అక్కసునంతా ఇలా వెళ్లగక్కుతున్నారు. దేశంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో కలుపుకొని సుమారు 300 దాకా ఉన్నాయి. కానీ జెఎన్‌యు, జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి కమ్యూనిస్టు, ముస్లిం ఆధిపత్యం ఉన్నచోట మాత్రమే నిరసనలు ఎందుకు వస్తున్నాయి? అలాగే బెంగాల్, కేరళ, ఢిల్లీ వంటిచోట్ల సూడో సెక్యులర్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అక్కడా హింస చెలరేగింది. అసాంఘిక శక్తులకు పినరయ్ విజయన్ ఆశ్రయం ఇస్తే, మమతా బెనర్జీ ఏకంగా పెద్ద ర్యాలీ తీసింది. ఇక విశ్వవిద్యాలయాల్లో ఉంటున్న విద్యార్థులకన్నా నిరసనల్లో పాల్గొన్నవారి రెండింతలు ఉంటుంది. అంటే బయట శక్తులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నమాట. అలాగే త్వరలో ఎన్నికలు రానున్న ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉండడానికి అక్కడ ‘సంతుష్టీకరణ’ మళ్లీ మొదలైంది. ఈ బుజ్జగింపు రాజకీయాలు మానుకోకపోతే దేశం ఎన్నటికీ అభివృద్ధి చెందదు. ‘అందరూ సమానం అనకుండా కొందరు మాత్రమే సమానం’ అనుకునే ధోరణినుండి సెక్యులర్ పార్టీలు బయటపడకపోతే ‘షా’ విసిరిన వలలో పడ్డట్లే..!
ఈ తుక్డే తుక్డే గ్యాంగుకు భలే ఆశ్చర్యకరమైన ‘లింక్’ ఉంటుంది. కన్హయ్య కుమార్ లాంటివాళ్లు విద్యార్థులను రెచ్చగొడతారు. దిగ్విజయ్‌సింగ్, మమత, కపిల్ సిబాల్ వంటి నాయకులు దీనికి పార్టీల రంగు ఇస్తారు. బర్ఖాదత్తా, సర్దేశాయ్ వంటి మీడియా వ్యక్తులు ఈ విషయాన్ని మార్కెట్ చేస్తారు. సీతారాం ఏచూరి వంటివారు ఈ ఘటనను ‘ప్రజాస్వామ్యం’ అంటూ నమ్మిస్తారు. వాళ్లకు అనుగుణంగా రామచంద్రగుహ, అరుంధతీరాయ్ వంటివాళ్లు నేపథ్యం అల్లుతారు. క్రొత్త బిచ్చగాళ్లుగా సినిమాల్లో వుంటూ సెక్యులరిజం చెప్పే కమల్‌హాసన్, ప్రకాశ్‌రాజ్, ఖుష్బూ వంటి వారు దరువువేస్తారు. హిందువులకు సెక్యులరిజం ప్రబోధిస్తూ ఇస్లామిక్, క్రైస్తవ రాజకీయ శక్తులను బలపరిచే తస్లీమా రహమానీ, జాన్ దయాల్ వంటివారు వివిధ మీడియాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ల మాటలు నమ్మి రోడ్లకి వచ్చే వాళ్లను రక్షించేందుకు ‘హక్కుల సంఘాలు’ గన్లు లోడ్ చేసుకుని ఉంటాయి. ఈ ‘మెలోడ్రామా’ను విజయవంతం ఆడించేందుకు ‘ఎర్ర మీడియా’ సరైన రంగస్థలం సృష్టిస్తుంది.
సాక్ష్యాలు లేకుండా అబద్ధాలు ప్రచారం చేయడం ఇటీవల క్రొత్త ట్రెండ్. విదేశాల్లో సైతం భారత్‌ను అపఖ్యాతిపాలు జేయడం వీళ్లకు చాలా సులువైన పని. 2019 ఎన్నికలకు ముందు ఇదే కపిల్ సిబాల్ లండన్ వెళ్ళి సయ్యద్ షుజా అనే అంతర్జాతీయ హ్యాకర్‌కు ముసుగుతొడిగి ఈ విషయాలపై అసత్యాలు చెప్పించాడు. మన దేశ పౌరసత్వ సవరణ బిల్లుపై ‘అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్‌సీఆర్‌ఎఫ్) ‘తప్పుడు దిశలో వెళ్తున్న ప్రమాదకరమైన మలుపు’గా అభివర్ణిస్తే, దానికి భారత విదేశాంగ శాఖ ఘాటుగా జవాబు ఇచ్చింది. ఇంకొందరు అమెరికా ఇలాంటి బిల్లు తెస్తే హిందువుల పరిస్థితి ఏమిటి? భయపెడుతున్నారు. హిందువులు ఎక్కడైనా బాంబుదాడులు, మత హింస చేసారా? అయినా అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలపై ఇక్కడి సెక్యులరి పార్టీలకు అంత ప్రేమెందుకు? ఇక్కడున్న ముస్లింలపై ఈ బిల్లు వెంట్రుకంతైనా ప్రభావం చూపనపుడు ఎందుకు ధర్నా చేయాలి? జంధ్యాలు ధరించడం, స్వాముల చుట్టూ తిరగడం గుజరాత్, కర్ణాటక లాంటి ఎన్నికలు వచ్చినపుడు ఉత్సాహంగా చేసిన రాహుల్ గాంధీ, అతని పార్టీ నిజ స్వరూపం ఇపుడు బయటపడింది!
దేవతల బూతు చిత్రాలను గీసిన ఎం.ఎఫ్. హుస్సేన్‌ను ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇవ్వడం నిజమైన సెక్యులరిజమా? సిమి లాంటి ఉగ్రవాద సంస్థల్ని నిషేధిస్తే సోనియా తెగ బాధపడిపోయింది. వాళ్ల తరఫున సల్మాన్ ఖుర్షీద్ వకాల్తా పుచ్చుకొన్నాడు. ఇదంతా సెక్యులరిజమా? తస్లీమా నస్రీన్ లాంటి అంతర్జాతీయ రచయిత్రిని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో దాడిచేస్తే అది సెక్యులరిజమా? ఢాకా నగర నడిబొడ్డులో వున్న ఢాకేశ్వరీ దేవాలయాన్ని వేరేచోటికి తరలించాలని అక్కడి మత సంస్థలు ఆందోళన చేస్తున్నాయి. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం వల్లనే ఢాకాకు ఆ పేరు వచ్చిందని, అది ‘బెంగాలీ ప్రైడ్’ అని మమతా బెనర్జీ ఏనాడైనా మాట్లాడిందా? ఆప్ఘనిస్తాన్‌లోని ప్రాచీన బమియాన్ బుద్ధుని విగ్రహాలను తాలిబన్లు ఫిరంగులతో కూల్చేస్తుంటే ఒక్క సెక్యులర్ పార్టీ అయినా, ప్రపంచ హక్కుల త సంస్థ అయినా ఒక్క మాట మాట్లాడిందా? బలూచిస్తాన్‌లో లక్షలాది మంది ముస్లింలపై ఘోర అత్యాచారం జరుగుతున్నా, చైనా భూభాగంలో కొన్నిచోట్ల ముస్లింలపై తీవ్ర అణిచివేత జరుగుతున్నా ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ నోరు తెరిచిందా? భారత్‌లో ఉంటూ కాశ్మీర్‌పై ‘్భరత్ దురాక్రమణదారు’ అంటూ దుష్ప్రచారం చేసే అరుంధతీ రాయ్ వంటివాళ్లు ఈ దేశ హిందువులపై జరిగిన అత్యాచారాలపై ఏనాడైనా మాట్లాడిందా? ఇలాంటి ‘కుహనా సెక్యులర్ గ్యాంగ్’ చేసే కుట్రలు మోదీ, షా ద్వయానికి తెలియవనుకుంటే అమాయకత్వమే. ఇపుడు దేశం మొత్తం అక్కసును గమనిస్తోంది. ఇప్పటికే కమ్యూనిస్టు, కాంగ్రెస్‌లకు ప్రజలు దూరంగా ఉంటున్నారు అన్న విషయం 2014, 2019 ఎన్నికలు తేల్చినా పట్టించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకం తప్ప ఇంకేం జరుగదు.

bhaskarayogi.p@gmail.com