భక్తి కథలు

మార్గదర్శి మారుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైశాఖ బహుళ దశమినాడు జన్మించిన ఆంజనేయుని స్మరించిన వారికి బుద్ధిబలం, సద్బుద్ధి, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, వాక్పటుత్వం లభిస్తాయి. హనుమంతుని జీవిత చరిత్రను ఆకళింపు చేసుకొన్నవారికి లోకం పోకడ తెలుస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సత్యసంధత విలువ తెలుస్తుంది. శ్రీరాముని చేత ప్రశంసించబడిన హనుమంతుని పాత్ర రామాయణంలో తెలుసుకొంటే సజ్జనులతో మాత్రమే స్నేహం చేయాలని, ఏ కార్యాన్ని ఏవిధంగా పూర్తిచేసి అనుకొన్న విజయాన్ని పొందాలో కూడా తెలుస్తుంది.
సాధారణ వానరునిలాగానే హనుమంతుడు కూడా రావణుని లంకలో సీతమ్మ కనిపించకపోయేసరికి నిరాశ చెందాడు. వెంటనే ఆత్మహత్యకు పాల్పడుదామని అనుకొన్నాడు. కాని అదంతా క్షణోద్రోకం. వెంటనే తన్ను తాను సంభాళించుకున్నాడు. సీతమ్మను వెదికాడు. విజయంసాధించాడు. వానరులకు, రామాదులకు సాయం చేశాడు. అందుకే మనుష్యుల్లో ఎవరికైనా ఎపుడైనా దుఃఖం కలుగవచ్చు. అదే చివరిక్షణాలని అనుకోవద్దు. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు అంటారు కదా అట్లానే దుఃఖపు తెరలను తొలగించుకుని ముందుకు పోతే వీరాజనేయునిలాగా విజయాన్ని పొందవచ్చు.
ఆతిథ్యమిచ్చే మైనాకుడు కనిపించినా, నీడను పట్టి వెనక్కులాగే రాక్షసి సురస కనిపించినా హనుమంతుడు బెదరలేదు. పైగా వారిని నొప్పించలేదు. మిత్రులతో ఎంతో స్నేహం చేశాడు. అట్లానే శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు.
సీతమ్మను రాముడు లేనప్పుడు ఎత్తుకవచ్చి ప్రగల్బాలు పలికే రావణాసురునికి హితోపదేశం చేశాడు. ఒక మాట చెప్పితే అర్థం చేసుకోలేనప్పుడు ఒక దెబ్బవేయమన్నారు పెద్దలు అందుకే ఆంజనేయుడు మంత్రి కుమారులను ఇతర రాక్షసగణాన్ని మట్టుపెట్టాడు. పైగా తనకేదో కీడు కలిగించాలని రాక్షసులు తోకకు నిప్పు పెడితే ఆ నిప్పుతోనే లంక అంతా కాల్చి వేశాడు. చూశారా చూసి రమ్మంటే కాల్చి వస్తాడన్న సామెతకు అంకురమయ్యాడు
ఇలా హనుమంతుని ప్రతిమాట ప్రతి చేష్ఠ లోకులకు మార్గదర్శి అవుతుంది.
రామలక్ష్మణుల దగ్గరకు మారువేషంలోవచ్చిన హనుమంతుని వాగ్వైభవం చూసి రాముడు నవవ్యాకరణ పండితుడని గుర్తించాడు. సీతమ్మ దుఃఖార్తిలోనై ప్రాణాలను త్యాగం చేస్తాననుకొంటుండగా హనుమంతుడు ఆమె మనసుకు ఊరట కలిగిస్తూ రామాయణ గానం చేశాడు. దానితో హనుమంతుని శక్తియుక్తులను తెలుసుకొన్న సీతమ్మ హనుమంతుణ్ణి చల్లగా కాయుమని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది.
ఇటువంటి అమేయ పరాక్రమ శాలి హనుమంతుని స్మరించిన వారికి ఈతి, గ్రహ, పిశాచ బాధలేవీ దరిచేరవు. అందరికీ అభయమిచ్చే ఆంజనేయుడిని కోరి కొలిచిన వారికి లేనిది అంటూ ఏమీ ఉండదు.

--గున్న కృష్ణమూర్తి