రాష్ట్రీయం

భీమేశ్వరునికి మహాకుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదో రోజు వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞం

రామచంద్రపురం, డిసెంబర్ 24: దక్షిణకాశీగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారికి గురువారం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో గత 150 సంవత్సరాలుగా జరగని మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలోని చీకటికోణం ఎదురుగా గల మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగానికి ప్రత్యేకంగా ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాసం, రుద్రహోమం నిర్వహించారు. స్వామివారి నగరోత్సవ కార్యక్రమం అనంతరం అనువంశిక అర్చకస్వాములు, వేదపండితులు స్వామివారిని ఆలయ శిఖరం వద్దకు తీసుకెళ్లారు. దేశంలోని వివిధ నదుల నుండి సేకరించిన 1008 కలశాల జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం శిఖరానికి పుష్పపూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతా శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి కరుణామయి అమ్మ, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. కాగా ద్రాక్షారామలో అతిరుద్రం మహాయజ్ఞం ఐదో రోజైన గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి యాగశాలలో వైదిక కార్యక్రమాలు, హోమాదులు, గురువందనం, రుద్రాభిషేకం, వేదపారాయణం, మహాన్యాస ప్రక్రియ, నమకాలు జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుంది.