Others

ఎన్ని పనులున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ.. ఈ రెండు అక్షరాలు ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ప్రతీక. అమ్మ ప్రేమ స్వచ్ఛం. కలుషితరహితం. కాని నేటి పరిస్థితులు అమ్మతనాన్ని ప్రశ్నిస్తున్నాయ. అమ్మతనానికి మచ్చ తెచ్చే సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయ. దీనికి కారణమేదైనా సరే అమ్మ తన పిల్లలనే కాదు లోకంలోని అందరి పిల్లలను తన పిల్లలుగా చూసే నేర్పును కలిగి ఉంటుంది. అందుకే అలనాడు బాల్యంలో వివాహం చేసినా తనకు ఇరవై ఏళ్ల వయస్సు రాకముందే బిడ్డకు తల్లియైనా సరే అమ్మ ఆ బిడ్డను రాచబిడ్డగా లాలించేది. జీవితంలో ఉన్నత పథంలో నిలబడడానికి సర్వశక్తులను ధారవోసేది.
ఇపుడు ఒక పక్క కార్యాలయాల్లో పనులు మరో పక్క ఇంటి బాధ్యతలూ మోస్తున్నా కూడా పిల్లల విషయం వచ్చేసరికి ఎక్కడలేని సత్తువ వస్తుందామెకు. వారి ఆలనాపాలనా విషయాల్లో చిన్న పొరపాటూ లేకుండా వారిని కాపాడుతుంది.
ఒక రక్షణ విషయంలోనే కాదు అన్నింటిలో తాను కూడా ఉండి వారి నవజీవనానికి హేతువుగా నిలుస్తుంది.
కోడిగాని, కుక్కగాని ఆఖరికి పిల్లి కూడా తన పిల్లలను ఎంతో బాధ్యతగా పెంచుతుంది. ఇక్కడ పుట్టిన కసుగాయైనా చేవ గలదే అని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలుకదా. ఒక్క రక్షణలోనే కాదు వారికి సంస్కారాలను అందివ్వడంలోను, వారిని ఆచారాలను పాటించేలా చేయడంలోను, సనాతన ధర్మపరాయణులుగా తీర్చి దిద్దడంలో అమ్మదే పెద్ద బాధ్యత. నాన్న ఉన్నా ఆయన రక్షణ ఇస్తున్నా సరే అమ్మే అన్నీ తానై చేస్తుంది. అందుకే ఏకుల బుట్ట అంత అమ్మ ఉన్నా వానికి ఈ అవనిలో లేనిది ఏదీ లేదంటారు. ఇంతకు ముందుకాలంలో అమ్మమ్మలు నాన్నమ్మలు. తాతయ్యలు, అక్కలు, బావలు, అన్నలు, వదినెలు , బాబాయలు, పిన్నులు ఇలా ఎంతో మంది ఉండేవారు. వారంతా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకొనేవారు. కాని నేడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయ. ఇద్దరు ముగ్గురు పిల్లలే ఒక్కో ఇంటిలో నైతే ఒక్కరే ఉంటారు. వారి ఆలనా పాలనా అంతా అమ్మనాన్నలదే బాధ్యత. నాన్న కన్నా బాధ్యత తీసుకొనేది అమ్మనే.
బయట ప్రపంచం పోకడలు ఏవిటో వాటికి తగినట్టు ఎలా మెలగాలో అమ్మ నేర్పిస్తే ఆర్థికంగా ఎలా బలపడాలో ముందు చూపు ఎలా ఉండాలోనాన్న చెబుతాడు. ఏదైనా తల్లిదండ్రుల బాధ్యతలో పెరిగిన పిల్లలు నేడు తర్వాతి తరాలకు దివిటీల్లా వెలుగులీనుతున్నారు.

- పద్మజ