సబ్ ఫీచర్

శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రతుకంతా ఒత్తిడికి గురై నా, పోరాటం ఆగకుండా జీవితాన్ని శాంతి సౌభాగ్యాలతో గడపడం అనేది రాజయోగ సాధనతోనే సుసాధ్యం. ఆలోచనలు స్థిరంగా వుండనపుడు ఇంటా బయటా చికాకులు, చింతలు ఎదురైనపుడు మనోవికాసానికి దోహదపడేది యోగ అనుభూతి అనేది నిజం. యోగం అంటే రెండింటి కలయిక, రెండింటి సమన్వయం. నిర్మలమైన ఆలోచనలు, నిశ్చలమైన బుద్ధి, పవిత్రమైన సంకల్పాలు.. ఇవి మనిషిని, సమాజాన్ని శాంతి సౌభాగ్యాలవైపు నడిపిస్తాయని బ్రహ్మకుమారీలు వారి సందేశాన్ని అందిస్తున్నారు. మనిషి శరీరం గాలి, నీరు, మట్టి, ఆకాశం, అగ్ని.. ఈ ఐదు తత్త్వాలలో నిర్మితమైన బొమ్మలాంటిది. ఈ బొమ్మను కదిలించి, ఆడించి, నడిపించే శక్తి చైతన్యశక్తి. దానినే ఆధ్యాత్మిక భాషలో ఆత్మగా వర్ణించుతారు. ఆత్మలో విలువలకు దర్పణంగా నిలువెత్తు నిదర్శనాలు శాంతి, ప్రేమ, ఆనందం, కరుణ, పవిత్రతా గుణాలు.. ఈ దైవీ గుణాలే మానవున్ని మాధవునిగా చేస్తాయి.
ఎప్పుడైతే మనిషి తనకు తాను ఓ చైతన్య కరదీపికను, దైవీశక్తి ఆత్మను అనేది విస్మరించి ఎండమావులవంటి సుఖాల వెంట పరుగులు తీస్తాడో ఆనాడే మానవీయ గుణాలు మట్టిపాలౌతాయి. కోరికలు, ఆవేశాలు, ప్రలోభాలు, అహంభావ, మమకారాలు సూర్యుని చుట్టు మబ్బులవలె కమ్ముకుంటాయి. ఫలితంగా మానవతా సంబంధాలు ఆత్మీయతా అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు మరుగున పడతాయి. వీటిని పునఃజాగృతం చేయగల శక్తి ఒక్క నిరాకార, నిరామయ పరంజ్యోతి పరమాత్మతో అనుసంధానం చేసినపుడు రాజయోగానుభూతిని పొందగలం. ఈర్ష్యాద్వేషాలు, దుఃఖ అశాంతులు మబ్బులు తొలగిన రీతిగా విడిపోతాయ. యోగానుభూతి నిత్య సాధన ద్వారా నిరంతర అభ్యాసం ద్వారా పొందగలుగుతాం. జన్మజన్మలనుండి మనిషిని, మనస్సును పట్టి పీడిస్తున్న నకారాత్మక ఆలోచనలు, అనవసరమైన అశుద్ధ చింతనలు యోగాగ్ని ద్వారా భస్మమవుతాయి. మానవుని ఆత్మలో దాగివున్న అంతర్ముఖి స్థితి ద్వారా సహజ సిద్ధమైన ప్రశాంతత సహజమైన దయాగుణం తిరిగి పుంజుకుంటాయి. శారీరక మమకారాల ద్వారానే శరీర సంబంధాల ద్వారా మనిషి తనలోని సహజత్వాన్ని విస్మరించాడు. నేను అంటే ఈ మేను కాదు. నేను ఓ శక్తిసంపన్న పరమపావన పూజ్య స్వరూ ప ఆత్మతత్త్వాన్ని అని గ్రహించుటయే ఆత్మానుభూతి.

- బి.కె.సాంబమూర్తి