Others

ఐరాస వేడుకల్లో సుబ్బులక్ష్మి స్టాంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ 70వ స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి కర్నాటక సంగీత మహారాజ్ఞి దివంగత ఎంఎస్ సుబ్బులక్ష్మి గౌరవార్థం ప్రత్యేక స్టాంపును విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఐరాసలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటు ఆమె శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. సుబ్బులక్ష్మి ముఖచిత్రంతో కూడిన స్టాంపును విడుదల చేయాలని ఐరాస నిర్ణయించడంతో ఆమెకు మరోసారి ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం లభించనుంది. ఐరాసలో సంగీత కచేరీ చేసిన తొలి భారతీయ కళాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1966లో సుబ్బులక్ష్మి ఐరాసలో కచేరీ చేశారు. ఇదే ఏడాది ఆమె శతజయంతి కావడంతో ఐరాసలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి 19 వరకూ ఆమె అరుదైన చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ కచేరీని ఏర్పాటు చేస్తున్నారు. సుబ్బులక్ష్మి తర్వాత ఏభై ఏళ్లకు ఐరాసలో కచేరీ నిర్వహిస్తు న్న ఘనత రెహమాన్‌కు దక్కడం విశేషం.