సబ్ ఫీచర్

చిన్నారులతో వ్యాయామం చేయంచండిలా... సైకిల్ తొక్కటంలోనే ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారుల చేత ప్రతిరోజూ వ్యాయామం చేయంచాలంటే చక్కటి మార్గం వారి చేత సైకిల్ తొక్కించటం. సైకిల్ తొక్కటంలో వారు ఆనందం పొందుతారు. ఎదిగే పిల్లలు సైకిల్ తొక్కడంవల్ల వారికి మానసికంగా, శారీరకంగా ఎన్నో లాభాలున్నాయి. కండరాలు దృఢంగా, శక్తివంతంగా తయారవుతాయి. నడక తరువాత ప్రాధాన్యం ఉన్న వ్యాయామం ‘సైక్లింగ్’తో కాళ్లు, చేతులు, భుజాలు, వెన్ను, పొట్ట- ఇతర కండరాల రక్తప్రసరణ మెరుగై ఆరోగ్యవంతులవుతారు.
సైకిల్‌ను ఒక క్రమపద్ధతిలో తొక్కడంవల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి స్థూలకాయం ఏర్పడే ప్రమాదం ఉండదు. పిల్లల్లో సైక్లింగ్ ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే సైకిల్ తొక్కడంవల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అంత ‘స్టాప్ - లుక్- అండ్ ప్రొసీడ్’ మీద ధ్యాస అంత ముఖ్యం. స్వతంత్రంగా బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ తొక్కుతూ ముందుకు సాగడం పిల్లలకు మహా సరదా. అయితే సైకిల్ ఆటబొమ్మకాదని, అది ఒక వెహికల్ అని గమనించాలి. సైకిల్ కొనడంలో తల్లిదండ్రులు మెళకువగా ఉండాలి. పిల్లలు సైకిల్ తొక్కడంలో భద్రత ప్రధానమని, ట్రాఫిక్ నిబంధనలు అన్నీ వర్తిస్తాయని గుర్తించాలి.
పిల్లలు సైకిల్ తొక్కడం నేర్చుకునేప్పుడు పెద్దలు చాలా నేర్పుగా ఉండాలి. వారు సిద్ధం కాకుండానే సైకిల్‌ను నెట్టడం, తోయడం అత్యంత ప్రమాదకరం. ఐదు, ఆరు సంవత్సరాల వయసు పిల్లలైతే సైకిల్‌కి ఖచ్చితంగా రెండు సపోర్టు వీల్స్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు ఎదుగుతున్నకొద్దీ, సైకిల్ తొక్కడంలో అనుభవం వచ్చేకొద్దీ సపోర్ట్ వీల్స్‌ని తొలగించవచ్చు.
పిల్లల శక్తి సామర్థ్యాలతో సైకిల్ తొక్కవలసి ఉంటుంది కనుక వారికి సరియైనది అందించగలగాలి. గతంలో కొన్న చిన్న సైకిళ్లు వాడమనడం, ఎదిగే పిల్లలు కాబట్టి ముందుగానే పెద్ద సైకిల్ కొనడం లాంటివి అత్యంత ప్రమాదమని గుర్తించాలి.
ఆన్‌లైన్‌లో సైకిల్ ధర తక్కువుందనో, మోడల్స్ ఎక్కువున్నాయనో కొనడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. పిల్లలను షాపుకు తీసుకెళ్లి సరియైనది ఎంచుకోవలసి ఉంటుంది. దీనితో పిల్లలకు సైజులో, బరువులో సరిపోయినవే కాక వారి అభిరుచికి అనుగుణంగా, మోడల్, రంగు ఎన్నుకునే అవకాశం వుంటుంది. కొత్త సైకిల్ విలువ తెలియడమే కాక అది కొన్న అనుభూతి పొందుతారు.
సైకిల్ సరిగ్గా సరిపోవడం అంటే సీటుపై కూర్చుని హేండిల్ సౌకర్యంగా పట్టుకున్నపుడు రెండు కాళ్ల పాదాలు పూర్తిగా నేలపై ఆనాలి. ఫెడల్స్ సునాయాసంగా తొక్కగలగాలి. పిల్లలు బ్రేక్‌లు వేయగానే సైకిల్ వెంటనే ఆగేలా ఉండాలి. సైకిల్ బెల్, క్యారేజ్, వాటర్ బాటిల్ హోల్డర్ తదితర ఉపకరణాలు అన్నీ అత్యవసరం, ప్రయోజనకరం. ట్రాఫిక్‌లో సైకిల్ వాడే పిల్లలైతే హెల్మెట్ కూడా తప్పక కొనాల్సి వుంటుంది.
సైకిల్ రైడ్‌కి వెళ్ళేముందు ఖచ్చితంగా ట్యూబ్‌లో గాలి సరిపడా ఉందో లేదోనని టైర్‌లని పరీక్షించాలి. అలాగే బ్రేక్‌లు, ఇతర ఫిటింగ్స్ పనితనం ముందుగానే చూసుకుని కదలాలి.
సీట్ ఎత్తుకి సమంగా హేండిల్ బార్‌ని అడ్జెస్ట్ చేసుకోవాలి. సైకిల్ తొక్కడానికి వీలుగా, అంటే కాళ్ళు సౌకర్యవంతంగా కదిపేలా సీట్‌ని కొంచెం ముందుకి వంచుకోవచ్చు.
సైకిల్ వెనకాల రేడియం స్టిక్కర్‌లు, ముందు లైట్ ఉంటే రాత్రివేళల్లో సైకిల్ తొక్కడం సునాయాసం అవుతుంది. ఇవి విధిగా సైకిల్‌కి ఉండాలి కూడా.
సైకిల్ తొక్కేప్పుడు రెండు చేతులు హేండిల్‌ని విడువరాదు. పుస్తకాలు, ఇతర వస్తువులు ఏమైనా ఉంటే హేండిల్‌కి తగిలించకుండా క్యారియర్‌ని కాని, బ్యాక్‌ప్యాక్‌ని కాని వినియోగించాలి. రోడ్డుపై ట్రాఫిక్‌కు అనుగుణంగానే జాగ్రత్తగా బై సైకిల్ తొక్కాలి. సిగ్నల్స్ దగ్గర, కూడలిలో ఆగడం, చూసుకుని ముందుకు సాగడం చేయాలి.
సైకిల్ తొక్కుతున్నపుడు అవసరం అనుకున్నపుడు బెల్ వాడాలి. కుడి ఎడమలకు తిరగాల్సి వచ్చినపుడు హేండ్ సిగ్నల్ ఇస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్లాలి. ట్రాఫిక్‌లో అడ్డదిడ్డంగా కాకుండా నేరుగా సైకిల్ తొక్కాలి. రోడ్డుమీద గుంటలు, స్పీడ్ బ్రేకర్లు, ఆకస్మికంగా అడ్డంగా వచ్చే జనాలు, కుక్కలు, వాహనాలతో అప్రమత్తంగా ఉండాలి. సైకిల్ వినియోగంతో పర్యావరణ పరిరక్షణనే కాక నిత్యం కనీసం అరగంట తొక్కగలిగితే శారీరక, మానసిక ఉల్లాసం పొందవచ్చు. సైకిల్ తొక్కడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవటంతోపాటు కండరాల పుష్టికి దోహదం చేస్తుంది. పోటీ ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా వచ్చే అనేక రకాల రుగ్మతలను దరిచేరకుండా సైక్లింగ్ ద్వారా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- మురళీకృష్ణ.ఎం.