Others

చల్లటి పదార్థాలు దంతాలకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాక్లెట్లైనా, ఐస్‌క్రీమ్ అన్నా ఇష్టం లేనివారు ఎవరుంటారు? అందులో ఇవంటే పిల్లలకి ఇంక ఆడపిల్లలకి పిచ్చి. వాళ్లు అన్నం లేకుండా ఉండగలరేమో గాని చాక్లెట్లు, ఐస్‌క్రీంలు తినకుండా ఉండలేరు. అలాంటిది ఒకసారి ఓ ఇరవై ఆరేళ్ల అమ్మాయి వచ్చింది దంత చికిత్సకోసం. తను గత రెండేళ్లగా చల్లగా ఉండే వస్తువులే తినలేదు, ఇంకా తాగలేదని వాపోయింది. తనకి ఐస్‌క్రీం అన్నా, కూల్‌డ్రింక్స్ అన్నా పిచ్చని, కానీ అవి తినడం, తాగడం కుదరట్లేదని చెప్పి బాధపడింది. తన నోట్లో చల్లని పదార్థం ఏదైనా పడితే పళ్లు ‘జిల్’మంటాయని, దానికి కళ్లలో నీళ్లు తిరుగుతాయని చెప్పింది. ఎన్ని పుక్కిలించే మందులు ,టూత్ పేస్టులు వాడినా అవి తాత్కాలిక ఉపశమనం ఇచ్చాయే కాని శాశ్వతంగా ఆ ‘జిల్’ని దూరంచేయలేదని అంది. ఆమెని ఓదార్చి, పరీక్షించి తగిన చికిత్స చేసా. చికిత్స అయిన ఓ నెల తరువాత మళ్లీ వచ్చింది. ‘ఏంటి మళ్లీ పళ్లు ‘జిల్’అంటున్నా యా’అని నేనడిగిన ప్రశ్నకి లేదు డాక్టర్.
‘ఈసారి నా గొంతు ‘గుల్-గుల్’అంటున్నదని తమాషాగా సమాధానం చెప్పింది. పంటి చికిత్స జరిగిన తరువాత రెండేళ్లుగా ఐస్‌క్రీం ఇంక కూల్‌డ్రింక్స్ తినలేదన్న, తాగలేదన్న కసితో పొద్దున, రాత్రి విపరీతంగా తన కసి తీరేలా అవే తినడం తాగడం చేసిందట. దానికి ఆమె గొంతులో ఇన్‌ఫెక్షన్ వచ్చి మింగలేక పోతున్నానని అది చూపించుకోడానికి నా దగ్గరకొచ్చిందని చెప్పింది. ‘‘అతిగా ఏదిచేసినా దానివల్ల ఆనందం కలగదు. ఆవేదనే మిగులుతుంది.’’ ఓ పరిష్కారం ఎప్పుడు వేరే సమస్యకి పునాది కాకూడదు. అలా జరిగితే ఆ పరిష్కారానికి విలువ ఉండదు, దాని ఆచరించే వారికి పురోగతి ఉండదు.
అసలు పళ్లు ‘‘జిల్’’అని ఎందుకంటాయి
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు మన పంటి అనాటమీ తెలుసుకోవాలి. మనకి బయటకి కనిపించే పంటి పొర పేరు ఎనామిల్. ఇది శరీరంలోనే ఎముక కన్నా అతి గట్టినైన పదార్థం. ఈ ఎనామిల్‌కి జీవం ఉండదు. దాని లోపలి పొర పేరు డెంటిన్. ఈ పొర ఎనామిల్‌తో కప్పబడి ఉన్నంతవరకు ఏ సమస్య ఉండదు. కానీ ఎక్కడైనా ఎనామిల్ పోయి లోని డెంటిన్ బయటకి బహిర్గతం అయితే అప్పుడు ఈ ‘జిల్’సమస్య మొదలవుతుంది. ఏదైనా తీపి కానీ, వేడి కానీ, చల్లనివి కానీ ఈ డెంటిన్‌కి తాకితే ఆ పన్ను ‘జిల్’ అంటుంది.
ఏ సందర్భాలలో ఈ డెంటిన్ బహిర్గతం అవుతుంది:-
పుచ్చు పన్ను లోపలివరకు పోయిన వారిలో
చిగుర్లు జారిపోయిన వారిలో
పళ్లు బాగా అరిగిపోయిన వారిలో
చిగురు దెగ్గర పంటి భాగంలో గుంట పడిన వారిలో
పన్ను విరిగిన వారిలో
పుట్టుకతో వచ్చిన పంటి లోపాలున్న వారిలో
వీరందరిలో డెంటిన్ బహిర్గతమై ఈ ‘జిల్’కి కారణమవుతుంది.
వీరు పాటించాల్సిన సూచనలు
కొన్ని పుక్కిలించే మందులు, టూత్ పేస్ట్‌లు వాడితే అవి డెంటిన్ మీద ఓ పొరలా ఏర్పడి ఈ జిల్‌ని ఒక మేరకు తగ్గిస్తాయి. అందరిలో ఇవి అంత సఫలీకృతం కావు. కొందరిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొందరిలో అసలు కనిపించవు.
అలా చేసినా ఫలించనివారు ఏం చెయ్యాలి
ముందు కారణం ఏంటో తెలుసుకోవాలి.
1) లోతైన పుచ్చు పన్ను ఉంటే: వీరిలో ఓ ఎక్స్‌రే ద్వారా పుచ్చు ఎంత లోతుగా ఉందో, పంటి నరానికి ఎంత దగ్గరగా ఉందో లేక నరాన్ని తాకుతుందో ముందు చూసుకోవాలి. నరానికి దగ్గరగా ఉన్నవారిలో పుచ్చు మొత్తం తీసేసి సిమెంట్ నింపుతే సరిపోతుంది. పంటి నరాని తాకిన వారిలో రూట్ కెనాల్ అవసరం.
2) చిగుర్లు జారిపోయిన వారిలో:- ఇలా జరిగిన వారిలో చిగుర్ల ఇన్‌ఫెక్షన్ ఉండుండాలి లేక వయసువల్ల అయుండాలి లేక వంశపారంపర్యతవల్ల జరిగుండాలి. వీరిలో ఓ.పి.జి.అనే ఎక్స్‌రే ద్వారా ఎముక ఎంత ఉందో తెలుస్తుంది. దాన్నిబట్టి పంటి క్లీనింగ్‌తోపాటు చిగురు ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎముక తగ్గిన వారిలో కృత్రిమ ఎముక వేయవలసి ఉంటుంది. చిగురాపరేషన్ తరువాత వీరు చాలా శ్రద్ధవహిస్తూ చెప్పిన సూచనలని పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి.
3) పళ్లు బాగా అరిగిపోయిన వారిలో: పళ్లు కొరికే విధానంలో లోపం ఉండడంవల్ల గానీ, కోపంలో లేక రాత్ర నిద్రలో పళ్లుకొరికే అలవాటు ఉన్నవారిలో కాని, వయసువల్ల కాని పళ్లు బాగా అరిగిపోయినట్లయితే అటువంటి పళ్లకి కృత్రిమ పన్ను తొడగడం మంచిది. అరిగిపోయిన పంటికి రూట్ కెనాల్ చేయవలసి అవసరం అన్ని సందర్భాలలో ఉండదు. కొన్నిసార్లు కేవలం కృత్రిమ పన్ను (క్యాప్) తొడిగితే చాలు.
4) చిగురు దగ్గర పంటి భాగంలో గుంట పడిన వారిలో (ఱ్గడన్జి):
చాలా లోతైన గుంట కాకపోతే దానికి సిమెంట్ పెడితే సరిపోతుంది. చాలా లోతైనదైనా సిమెంట్ పెట్టాక కూడా తగ్గని వారిలో, నొప్పి ఎక్కువైన వారిలో రూట్ కెనాల్ చేసి క్యాప్ తొడగాల్సి ఉంటుంది.
5) పన్ను విరిగిన వారిలో:
కొద్దిగా విరిగిన వారిలో ‘కాంపోసిట్’అన్న పదార్థంతో చికిత్సచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ విరిగిన వారిలో కృత్రిమ పన్ను పెట్టడం మేలు.
ఓసారి ఓ కుర్రాడు చదువుకోడానికి కెనడా వెళ్లాడు. అక్కడ విపరీతమైన చలి. ఆ కుర్రాడికి మన దేశంలోనే ఈ పంటి ‘జిల్’సమస్య కొద్దిగా ఉండేది. ఎక్కువ తీవ్రం లేదు. నడిపేయవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ ఏ దంత వైద్యుడి సలహా తీసుకోకుండా అక్కడికి వెళ్లాడు. అక్కడ తినడం, తాగడం దేవుడెరుగు అసలు మాట్లాడలేకపోయాడు. నోరు తెరిస్తే పళ్లు ‘జిల్’మని ఆ చలికి లాగేసేవి. చలికాలం వచ్చినపుడు, వాతావరణం చల్లగా మారినపుడు మన పళ్లు జిల్ మనడం ఎక్కువవుతుంది. అక్కడికెళితే కాని తను తన పంటి సమస్యని ఎంత అశ్రద్ధ చేసేడో తనకి అర్ధంకాలేదు. అక్కడ దంత వైద్యం ఖరీదు కాబట్టి మన దేశానికి వచ్చి నావద్ద చికిత్స చేయించుకున్నాడు. స్థలాన్నిబట్టి మన సమస్యలు మారుతుంటాయి. నీటిలో ఉన్న మొసలికి భూమిమీద ఉన్న దానికన్నా బలం ఎక్కువ ఎలా ఉంటుందో, కొన్ని ప్రాంతాలలో కొన్ని సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటాయి.
ఆస్థమా, సైనస్ ఉన్న వారికి చలి, దుమ్ము ప్రదేశాలు పడవు. మన ప్రవర్తనే కాదు మనముండే ప్రదేశం కూడా మన అభివృద్ధికి సహకరిస్తుంది. మన స్థితి మన గతి, మన దేశం, మన ప్రదేశం, మన లౌక్యం, మన సౌక్యం అన్ని ముఖ్యమే.

-ఢా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com