సబ్ ఫీచర్

పచ్చి మిరప.. చాలా గ్రేటు గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చిమిరపకాయలో కేలరీలు సున్నా, కానీ కేలరీలకు మించి మనకు శక్తినిస్తాయి. ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటలపాటు ఈ ప్రభావం ఉంటుంది. క్యాన్సర్ బారి నుండి రక్షణ కల్పిస్తుంది. గ్రీన్ చిల్లీస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. దాంతో క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఏజింగ్ ప్రాసెస్‌ను కూడా నిధానం చేస్తుంది. బ్లాక్ అయిన్ నాసికా ద్వారాలు ఓపెన్ అయ్యేందుకు సహాయపతాయి. ఇందులో వుండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. చాలావరకూ సగటు ఇండియన్స్ గ్రీన్ చిల్లీలను తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. చిల్లీ పెపర్‌లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలే, నార్మల్ గ్రీన్ చిల్లీలో కూడా ఉన్నాయి. మన ఇండియన్ గ్రీన్ చిల్లీస్‌లో ఉండే, మనకు తెలియని అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మిరప లేకుండా వంట లేదు. పచ్చిమిరపలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్‌లో చేర్చారు. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసిన్. ఇది బ్రెయిన్‌లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది. అందుకే వంటల్లో కారంపొడిని ఉపయోగించడం కంటే, పచ్చి మిర్చిని చేర్చడం ఎప్పుడు మంచిదని భావిస్తుంటారు.
మిరపకాయలన్నింటిలో కారం ఇచ్చే రసాయనం ‘కాప్సైసిన్’ అనే ఆల్కలాయిడ్ వుంటుంది. ఈ రసాయనానికి ఔషధ గుణాలు పుష్కలంగా వున్నాయి. అంతేకాదు, మిరపలో కారంతోపాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. బీన్స్, ఆకుపచ్చ ద్రాక్ష, గ్రీన్ యాపిల్, బఠానీలు, పాలకూర, పచ్చిమిరప, దోసకాయ, బ్రోకోలి వంటి వాటిలో ‘క్లోరోఫిల్’ ఉంటుంది. దీని కారణంగానే అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ ఆహారంలో ఉండే లుటీన్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని ‘్ఫలేట్’ పుట్టుక లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భిణీ స్ర్తిలకు ఈ తరహా ఆహారం తీసుకుంటే మంచిది.
ముఖ్యంగా గ్రీన్ చిల్లీస్‌లో జీరో క్యాలరీలను కలిగి వుంటుంది. మిరపకాయ తింటే సాధారణంగా నోరు మంట పుడుతుంది. కాని కడుపులో మంట పుట్టడంతోపాటు అందులో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించేస్తుందని తాజాగా తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. మిరపకాయ తినడంతో శరీరంలో పుట్టే వేడివలన శరీరంలోని కెలోరీలను పెంచి కొవ్వును కరిగిస్తుందని పరిశోధకులు తెలిపారు.
పచ్చిమిర్చి మెదడులోని ఎండోర్ఫిన్‌ను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిమీద ప్రభావం చూసి మన మూడ్‌ను మార్పుతుంటుంది. గ్రీన్‌చిల్లీ ఏ విధంగా ఊపిరితిత్తులను కాపాడుతుంటే ఇప్పటికీ తెలియదు. కానీ పచ్చిమిర్చి లంగ్ కాన్సర్‌ను నివారించడంతో గొప్పగా సహాయపడుతుందని, లంగ్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే లక్షణాలు వీటిలో ఉన్నాయని అంటారు. ముఖ్యంగా స్మోకర్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ముఖ్యంగా ఎవరైతే ఐరన్ లోపంతో బాధపడుతున్నారో వారు గ్రీన్ చిల్లీస్ నుండి నేచురల్‌గా ఐరన్ పొందుతారు. పచ్చిమిర్చిలో విటమిన్ కె తగినంత ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుంది. అయితే పెప్టిక్ అల్సర్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే బెటర్.
భూమికకు రచనలు

పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.net
కు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి