సబ్ ఫీచర్

సవాల్.. సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్తర్‌లో ఏ గిరిజన బాలికను అడిగినా సీఆర్‌పీఎఫ్ అధికారి ఉషాకిరణ్ నిజాయితీ, నిబద్దత, తెగువ గురించి చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే ఆమె అంటే ఆ గిరిజన బాలికలకు అంత ఇష్టం. నిత్యం మావోయిస్టు కార్యకలాపాలతో అట్టుడిగే బస్తర్‌లో పనిచేయాలంటే ఏ అధికారి కూడా ముం దుకు రారు. అలాంటి ఏరియాకు ఏరికోరి పోస్టింగ్ వేయించుకున్న ఉషాకిరణ్ అక్కడి గిరిజనులతో మమేకమైంది. అంతేకాదు అక్కడ చదువుకునే ఆడపిల్లలకు ఆమె ఓ స్ఫూర్తి. ఏకె-47 పట్టుకుని బస్తర్‌లో ధైర్యంగా గస్తీ తిరిగే ఆమె వారికి పెద్ద ఊరట అని చెప్పాలి. ఆమె కనబరిచే ఆత్మవిశ్వాసానికి ఆ అమాయక గిరిజన పుత్రికలు ఆచ్చెరువొందుతారు. గస్తీలో భాగంగా పాఠశాలలకు వెళ్లి వారితో మాట్లాడుతుంటుంది. చాలామంది విద్యార్థినులు ఆమె క్యాంప్‌కు వస్తుంటారు. తాము చదువుకుని సీఆర్‌పీఎఫ్‌లో జాయిన్ అవుతామని అం టుంటారు. గుడ్‌గావ్‌కు చెందిన ఉష సీఆర్‌పిఎఫ్‌కి ఎంపికయ్యాక దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే అవకాశం వచ్చినా బస్తర్‌నే ఎంపికచేసుకున్నారు. గిరిజనులతో మమేకమై సవాల్‌గా తీసుకున్న బస్తర్‌లో ఆమె సంచలనమైయ్యారు. తన తదుపరి ప్రాంతం జమ్మూకాశ్మీర్ లేదా ఈశాన్య ప్రాం తంలో సమస్యాత్మక ఏరియా అని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చెబుతుంది.