సబ్ ఫీచర్

చీరకు సాటి ఏది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగువల అందచందాలను చీరలు చూపగలిగినంతగా వేరే ఏ వస్త్రాలూ చూపలేవని ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞులందరూ అంగీకరిస్తున్న విషయమే. ప్రాక్,పశ్చిమ దేశాల్లోనూ ఎవరి వస్తధ్రారణ పద్ధతులు వారికి ఉన్నాయి. నైసర్గిక వాతావరణ పరిస్థితులు మన వస్తధ్రారణను ప్రభావితం చేయడం సహజ పరిణామం. కానీ, పాశ్చాత్య సంస్కృతి ప్రపంచం అంతటా వేగంగా వ్యాపించడంతో పాశ్చాత్య దుస్తుల విధానమూ హెచ్చుగా వ్యాప్తి చెందింది. పాశ్చాత్య దేశాలలో నైసర్గిక, వాతావరణ పరిస్థితుల వల్ల చాలామందికి ఫుల్‌సూట్ అలవాటు అయింది. పాశ్చాత్య దేశాల అగ్ర నాయకులలో ‘సూటు’ వేసుకోవడం ప్రధానమైనప్పటికీ ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. సోవియట్ నియంత స్టాలిన్ మెడవరకూ గుండీలు పెట్టుకొనే కోటు వేసుకునేవారు.
ఆఫ్రికా దేశాలలో ఎవరి వస్తధ్రారణ విధానం వారికి ఉంది. కొందరు రంగు రంగు వస్త్రాలు ధరిస్తే కొందరు తెల్లని వస్త్రాలే ధరిస్తారు.
అరబ్బులకు ఒక ప్రత్యక వస్తధ్రారణ విధానం ఉంది. ప్రాక్ దేశాలలో చైనా, జపాన్ దేశాలు మొదలు మయన్మార్ వరకు ఇంచుమించు ఒకే పద్ధతిలో వస్తధ్రారణ కనిపిస్తుంది. కొన్ని దేశాలు ఇటు నైసర్గిక పరిస్థితులకు, అటు అంతర్జాతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని తమ జాతీయ దుస్తులను రూపొందించుకున్నాయి. ఉదాహరణకు నేపాల్‌లో కోటు, టోపీ విలక్షణంగా కనిపిస్తాయి. కోటు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినా, టోపీ మాత్రం స్థానికమైనది. మన దేశంలో జాతీయ దుస్తులుగా ఫలానా డ్రెస్సు వేసుకోవాలనే నిర్బంధం ఏదీ లేదు. స్ర్తిలు సాదా చీర, జాకెట్టు కానీ, షల్వార్ కమీజ్, దుపట్టాను ధరించవచ్చు. పురుషులు షేర్వానీ, చుడీదార్ పైజమా కానీ, మెడవరకు గుండీలున్న కోటు, పంచె కానీ ధరించవచ్చు. 1987లో సార్క్ దేశాల సభ జరిగినపుడు శ్రీలంక, భూటాన్, నేపాలీ దేశాల పాలకులు తమ తమ జాతీయ దుస్తులు ధరించి హాజరయ్యారు. అందులో కానవచ్చిన విశేషం- శ్రీలంక, భారత్, నేపాలీ, భూటాన్ దేశాల పాలకుల అర్ధాంగులంతా చీరలు కట్టుకుని రావడం. దక్షిణ ఆసియా ఉపఖండ సంస్కృతిలో ఏకత్వానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. నేటి ఆధునిక యుగంలో వస్తధ్రారణకు సంబంధించి ఎనె్నన్ని ఫ్యాషన్లు ముంచెత్తుతున్నా- భారతీయ సాంప్రదాయ వస్తధ్రారణ అయిన చీరకట్టుకు మాత్రం ఆదరణ చెక్కు చెదరలేదు.

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి