Others

ఒకరికొకరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నువ్వు..నీకు నేనూ, ఒకరికొకరం .. నువ్వు నేను అన్నట్లు ఎనిమిది పదుల దాంపత్య జీవనంలో ఎన్నో ఎత్తుపల్లాలను, మంచి చెడుల అనుభవాలను సరిసమానంగా పంచుకున్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు ఈ వృద్ధ దంపతులు. అత్యధిక కాలం వైవాహిక జీవితం గడిపిన దంపతులుగా జీరం-గంగా రవీజ్ న్యూజిలాండ్‌లో ఇటీవలనే ఎంపికయ్యారు. భారత సంతతికి చెందిన ఈ దంపతుల వయసు 99 ఏళ్లు. మరో రెండు నెలల్లో వందో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. జీరం 4మే, 1916లోనూ, గంగా రవీజ్ జూన్ 6, 1916లో జన్మించారు. ఇద్దరి మధ్య ఒక్క నెల రోజులు తేడా మాత్రమే. పదకొండేళ్ల వయసులో జీరం రవీజ్ న్యూజిలాండ్ వెళ్లారు.
అక్కడే పెరిగి పెద్దయ్యారు. 19 ఏళ్ల ప్రాయంలో గంగను వివాహం చేసుకున్నారు. న్యూజిలాండ్‌లోనే స్థిరపడిపోయిన జీరం రవీజ్ దంపతులకు 15 మంది మనవళ్లు, మనవరాళ్లు, 25 మంది ముని మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో న్యూజిలాండ్‌లో ఉన్న జీరం రవీజ్ మహాత్మాగాంధీ పిలుపునందుకుని అక్కడ ఉద్యమంలో పాల్గొని పది నెలలు కారాగారవాసం కూడా అనుభవించాడు. దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే అందుకు అవగాహన, ఓర్పు ఎంతో అవసరం అని అంటారు గంగా. కష్టాలు ఎదురైనపుడు సహనంగా ఉండమని తమ పిల్లలకు పదే పదే చెబుతుంటానని ఆమె పేర్కొన్నారు.
భార్యభర్తల మధ్య చిన్ని చిన్ని త్యాగాలే వారి దాంపత్య జీవితాన్ని దృఢపరుస్తుందంటారు గంగా రవీజ్.
*