Others

ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరు తరుణుల పీతాంబర ప్రభలు
కొమ్మల రెమ్మల కోలాటములు
మందారము, సిరిమల్లె నవ్వులు
వసంత సుందరి వయ్యారములు
తెలుగు తేజమును రంగరించుకుని
ఉగాది వెలుగులు విరజిమ్మింది.

మత్తకోయిలల మధుర స్వరాలు
శాతవాహన యశోగీతములు
భ్రమరాదుల ఝుంకారధ్వనికి
పక్షుల కిల కిల తాళమేయగా
తెలుగు జాతి తేజోవిలాసమున
నూతన సంవత్సరమొచ్చింది

ఆదికవి, తిక్కన, పోతన కవి
తామృత ధారలు గుండె నిండగ
కాళహస్తి, రామప్ప బొమ్మలు
నాట్యానికి భంగిమలు నేర్పగ
పంచభక్ష్య పరమాన్నములిచ్చి
పూలకారు పులకలు అలికింది.

అన్నమయ్య, రామదాసు కీర్తనలు
అమ్మపాల కమ్మని రుచులవగ
అచ్చమాంబ, గురజాడల కథలు
అచ్చతెలుగు సాక్షాత్కారముగా
ముసి ముసి నవ్వుల ముగ్ధమోమున
సిగ్గులు బుగ్గల ముగ్గులైనవి.

అవధానము కవితాగానములు
పాలకోవ తీపిని అందించ
కూచిపూడి, పేరిణి నృత్యములు
చైతన్య కేతన మెగరేయగ
పచ్చడి రుచి, పంచాంగ శ్రవణము
జుంటితేనె ధారలు పంచినవి.

వీరాంగనలు రుద్రమ, నాగమ
వీరవిహారం మదిలో మెదలగ
సమ్మక - సారక్క సాహస కృత్యము
మగువ మాంచాల తెగువ పొగడగ
సమరాంగణమున శాలివాహనుని
శక్తియుక్తులను నెమరేసింది.

కృష్ణరాయలు, ప్రతాపరుల్ర
ఖడ్గ ధార కన్నుల మెరియంగ
అప్పాజీ, బ్రహ్మన, యుగంధర
మంత్ర తంత్రములు గుణింతాలుగ
ఏబదారు అక్షర స్వరలయల
తెలుగు వీణ స్వాగతము పాడెను.

ఐతా చంద్రయ్య