Others

దుర్ముఖికి సుస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదుగదుగో వస్తున్నది నవ దుర్ముఖి ఉగాది
ఇది మానవ జన మేధోమథనానికి పునాది
దుర్ముఖియను పేరేమిటి? మర్మమేమిటో వినండి!
దుర్మద దేశద్రోహుల దృష్టి దహించుటకెనండి!
ధనస్వాముల, దళార్ల చీకటి ముసుగులు
జనసేవా పరాయణోజ్వల దృష్టుల భస్మమగును
తరతరాల ఒక కుటుంబ దర్పపు పాలన అది యొక
దురాచారమే! నేటికి తొలగినదది శుభసూచన
భారత సంస్కృతిదెలిసిన వారె పాలకులు గావలె!
వారసత్వ రాజకీయ వరుసలింక చెల్లబోవు
ఎనే్నళ్లో దుష్పాలన హింసలు పడి పడి పేదలు
ఇన్నాళ్లకు తమ మూడవ కన్ను దెరిచి ఉగ్రులైరి
ఈ దుర్ముఖి ఉగాదితో ఈ జన చైతన్యంతో
పేద ప్రజల సాధికార వేదికయగు రాజ్యమింక
నగములు అడవులు చెరువులు నదులను గనులను మింగే
దగాకోరు నాయకుల తప్పదింక చిప్పకూడు
ఇది భారత సత్యనిష్ఠహితుల విజయభేరియే
సదమల పరిపాలన యిక సాగుగాక భారతమున
ఇకపై రాబోవు ప్రజాహితుల విజయ పరంపరకు
సకల జనుల సహకారం సమకూడుటకిదియె నాంది
ఇంతింతై వటుడింతై ఎంతో విజ్ఞానంతో
అంతరిక్ష గ్రహాలపై అడుగిడజాలిన మనుజులు
అంతులేని అవినీతికి అంతం పలుకగలేరా!
ఇంత ఉదాసీనమేల? ఇక కన్నులు దెరవండోయ్!
మన దేశము జగతికి తలమానికముగ వెలుగుటకై
మనమున పార్టీ భేదాల్ మాని రాజనీతి విదులు
సమైక్య కృషితోడ భరజాతినంత మేల్కొలుపుడు
రమణీయంబైన రామరాజ్యంబును స్థాపింపుడు
నవ దుర్ముఖి శుభవర్షమ! నవ్యయుగ శుభోత్కర్షమ!
సవినయముగ మేమొసంగు స్వాగతమ్మునందుకొనుము

-పారుపల్లి వెంకటేశ్వరరావు