సబ్ ఫీచర్

ఉల్లాసం ... ఉత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ 45 నిమిషాలు నడక నడిస్తే శరీరంలోని కొవ్వును దీర్ఘకాలం తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపీడనాన్ని, శ్వాసక్రియ సామర్థ్యాన్ని పెంచుతుంది. నడక వ్యాయామంపట్ల శ్వాసక్రియ పెరిగి గుండె వేగంగా రక్తాన్ని తోడి శరీర భాగాలకు పంపుతుంది. ఆ విధంగా ఆక్సిజన్ వినియోగమవుతుంది. వృద్ధాప్యంలో అనేక జబ్బులు వ్యాయామ లోపంవల్ల, అనారోగ్యకరమైన భోజనపు అలవాట్లు, మద్యపానం, ధూమపానంవల్లనే వస్తాయి. నడక జీవిత ప్రమాణాన్ని, నాణ్యతను వృద్ధి చేసి మంచి ఆరోగ్యాన్ని కలిగించే శక్తి నడక టానిక్. ముసలితనంలో దినచర్యగా నడక నడవటం మరచిపోరాదు. వయస్సుతో నిమిత్తం లేకుండా నడక నడవడం మంచిది. యవ్వనంలోనే తగిన వ్యాయామం చేస్తే వృద్ధాప్యంలో అసలు సమస్యలు రావు.
నడిచే తీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
సమాజంలో వ్యక్తిత్వాన్ని వెల్లడించే సాధనంనడక.
వేగపు నడక స్ర్తిల గుండెను సరైన ఆకారంలోను,
సమస్థితిలో ఉంచుతుంది.
రక్తపీడనాన్ని, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
మలబద్ధకాన్ని పోగొట్టి, నిద్రలేమిని తగ్గిస్తుంది.
క్రమం తప్పని నడక వ్యాయామంవల్ల స్ర్తిలు
సహజ సౌందర్యంతో ప్రకాశిస్తారు.
అందం పెరుగుతుంది.
ఆరోగ్యంగా వుండే శరీరంవల్ల మనస్సు
ఉల్లా సంగా ప్రశాంతంగా వుంటుంది.
నడక మానసిక వత్తిడిని హరిస్తుంది.
వేగవంతమైన జీవన విధానంలో వత్తిడిని
తగ్గించుకోవడానికి, తాత్కాలిక నిరాశ నుంచి ఉపశమనం కలుగజేయడానికి, ఆత్మనిగ్రహానికి, ఆత్మ
ఉన్నతికి, అనారోగ్యం నుండి బయటపడటానికి
నడక ఎంతో సహకరిస్తుంది. మనస్సుకు ఉన్నత విలువలను కలిగించి దీర్ఘాయుష్షుకు సహకరిస్తుంది.
...............
స్ర్తి అందానికి వరం
....................
స్ర్తిలు వేగపు నడకను నిత్య వ్యాయామంగా ఎంచుకుంటే స్థూలకాయం, ఎముకల వ్యాధులు, క్యాన్సర్, గుండెపోటు, మానసిక వత్తిడి వచ్చే అవకాశాలు తక్కువ. మెనోపాజ్ చివరి దశలో అనగా 40 నుండి 50 ఏళ్ళ మధ్య వయస్సుగల స్ర్తిలు నడక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఋతుక్రమం ఆగిపోయిన వారికి నడక అద్భుత ఫలితాలను ఇస్తుంది. బలహీనపడిన ఎముకలు పటిష్టమవుతాయి. నడకతో పాటు కాల్షియం అధికంగా వుంటే ఆహారాన్ని స్వీకరించడంవల్ల ఎములకు బలం చేకూరి పటిష్టమవుతాయి.

- నల్లా నరసింహమూర్తి