Others

ఇంటి ఆర్థిక మంత్రి ఇల్లాలే.. ( నేడు మహిళా పొదుపు దినోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లాలిని ఇంటి ఆర్థిక మంత్రి అంటారు. భార్య చేసే పొదుపే ఆ ఇంటి భవిష్యత్ పురోగమనానికి వెలుగు. వృధా కానిదే ఆదా.. ఇదే పొదుపు. ‘‘చీమ ఎంతో చిన్నది, పనిలో ఎంత మిన్నది, ముందుచూపు వున్నది, పొదుపులోన మిన్నది..’’ అంటూ చిన్నప్పుడే పాడుకున్నా ఇంకా పొదుపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. పొదుపు అంటే వచ్చే ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన దానిలో కొంత భవిష్యత్ అవసరాలకు వెనుకేసుకునే డబ్బు అనుకునే రోజులు పోయాయి. పొదుపు చేశాక మిగిలిందే ఖర్చుచేయాల్సిన రోజులొచ్చాయి. ఎందుకంటే మన పొదుపే మనల్ని భవిష్యత్తులో ప్రణాళిక వేసుకున్న అవసరాలకు, అంచనాలో లేని, ఆకస్మికంగా వచ్చిపడే అవసరాలకు, అలాగే రిటైర్మెంట్ జీవితానికి.. ఇలా చాలా సందర్భాల్లో ఆదుకుంటుంది.
నేటి మహిళ కుటుంబ ఆదాయంలో పాలు పంచుకుంటోంది. అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. కాని చాలామంది మహిళలు పొదుపు, మదుపుల విషయంలో అంత ఆసక్తి కనబరచడంలేదనేది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు నిర్వహిస్తున్నాయి. ఆడపిల్లలకు పిపిఎఫ్ తరహాలో సుకన్య సమృద్ధి యోజన గత సంవత్సరం అందుబాటులోకి వచ్చింది. దాదాపు అన్నీ బ్యాంకుల్లో మహిళలకు వివిధ సదుపాయాలను కల్పిస్తున్నాయి. వీరు నిర్వహించే సేవింగ్ అకౌంట్‌లకు మినిమమ్ బ్యాలెన్స్ అంటూ లేకపోవడం, లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు మినహాయించడం, ఎక్కువ వడ్డీ అందించడం, ఇన్సురెన్స్ కల్పించడం మొదలైన ప్రయోజనాలు అందిస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా వివిధ అవసరాలకు, వ్యాపారాలకు లోన్స్ ఇవ్వడమే కాకుండా వడ్డీలో కూడా రాయితీలు ఇస్తున్నారు.
దుస్తులు గృహోపకరణాలు వగైరా కొనుగోళ్ల విషయంలో అనవసరపు డాంబికాలకు పోకుండా అవసరమైనవేమిటో చూసుకోవాలి. రోజువారి ఖర్చు
లను నిత్యావసరాలు, అదనపు ఖర్చులు, ఆస్పత్రి, మందులు.. ఇలా విభజించి రాసిపెట్టుకోవాలి. ఈ చిట్టా మన ఆదాయ వ్యయాలను ప్రతిబింబించేలా ఉండాలి. ఐదేళ్లకు చేసిన పొదుపు, గృహ రుణాల చెల్లింపులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మందులు, ఆస్పత్రి ఖర్చులు, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలు.. వీటిపై ఇన్‌కంటాక్స్ మినహాయింపు వుంటుంది. ఇదికాక ప్రత్యేకంగా మహిళలకు అదనంగా ఇన్‌కంటాక్స్ పరిమితి ఉంటుంది. ఆధునిక మహిళలకు ప్రత్యేకంగా పలు ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ పాలసీలను అందిస్తున్నాయి.
అనారోగ్యాలు, ఆకస్మిక ప్రయాణాలను ఊహించలేం. ఇవి మినహా రాబోయే ఆర్థిక అవసరాలకు ముందుగానే బడ్జెట్ తయారుచేసుకోవాలి. పొదుపు, మదుపులపై చక్కని అవగాహన కలిగి తదనుగుణంగా వ్యవహరించాలి. అయితే మన సేవింగ్, ఇనెవెస్ట్‌మెంట్‌లకు ఒక లక్ష్యం తప్పక ఉండాలి. అలాగే భవిష్యత్ అవసరాల ప్రాధాన్యత క్రమం తప్పకూడదు. ఒక్కొక్క అవసరానికి తగ్గట్టుగా పొదుపులో, మదుపులో ఒక్కో వ్యూహం ఎన్నుకోవాలి. వాటిని తరచూ సమీక్షించడం మరవద్దు. ఏతావతా క్రమం తప్పకుండా నిరంతరం పొదుపు చేయడం, పొదుపును కూడా అనివార్యమైన ఓ ఖర్చుగా పరిగణించి, తప్పనిసరిగా పొదుపు చేయడం చాలా కీలకం అని గుర్తించాలి.

- మురళీకృష్ణ.ఎం.