ఆంధ్రప్రదేశ్‌

‘కోల్డ్ స్టోరేజ్’ అక్రమాలపై సభా సంఘానికి డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధ్యం కాదన్న మంత్రి బొజ్జల

హైదరాబాద్, మార్చి 17: రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు పాల్పడుతున్న అక్రమాలను విచారించేందుకు సభా సంఘాన్ని వేయాలని సభ్యులు చేసిన అభ్యర్థనను మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. గుంటూరు జిల్లాలో ఓ కోల్డ్ స్టోరేజ్ యజమాని, డిసిసిబి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తూ రైతులకు తెలియకుండా వారి పేర్లతో రుణాలు తీసుకుని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైనాన్ని ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్, గొల్లపల్లి సూర్యారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కొమ్మలపాటి శ్రీ్థర్ గురువారం నాటి సభలో అత్యవసర ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రశ్నగా ఈ అంశాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. ముందుగా ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కోల్ట్ స్టోరేజ్ యాజమాన్యం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. నాణ్యమైన సరుకును రైతులు కోల్ట్ స్టోరేజ్‌ల్లో ఉంచితే, కొద్ది రోజుల తరువాత ఆ సరుకును తొలగించి, అందులో నాశిరకం సరుకును ఉంచి, కోల్ట్ స్టోరేజ్‌లను తగులబెట్టి, ఇన్స్యూరెన్స్ పొందుతున్నారని అన్నారు. రైతుల పేరుతో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయని అన్నారు. రుణాలు తీసుకుంటున్నప్పుడు త్రైపాక్షిక ఒప్పందాల సమయంలోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆంజనేయులు వివరించారు. గుంటూరు జిల్లాలోని ఒక కోల్డ్ స్టోరేజ్ యజమాని, డిసిసిబి చైర్మన్‌గా కూడా వ్యవహరించారని, అదే సమయంలో సుమారు 15 కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి రైతులకు తెలియకుండానే వారి పేరిట రుణాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. మార్కెట్‌లో మిర్చి ధర క్వింటా సుమారు ఎనిమిది వేల రూపాయలు ఉంటే, దాన్ని మూడు వేల రూపాయలకు తగ్గించి వేలం వేశారని ఆయన చెప్పారు. రైతులు ప్రశ్నిస్తే, సరుకు నాణ్యత, బరువు తగ్గిందని చెప్పి 927 మంది రైతులను మోసగించారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ కడప, గుంటూరు, విశాఖ జిల్లాల్లోని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు కూడా రైతులకు తెలియకుండా రుణాలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజ్‌లు నియమ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని అన్నారు. కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.