రాష్ట్రీయం

ఆకుపచ్చ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడ్జెట్ మహా సంకల్పం చెప్పుకున్న సర్కార్

1.3 లక్షల కోట్లతో భారీ బడ్జెట్
==================
ఆర్థిక శాస్త్ర పితామహుడు కౌటిల్యుడికి ఉన్న రాజనీతిజ్ఞత, భవిష్యత్ అవసరాలపై నాటి అశోక చక్రవర్తికి ఉన్నంత దార్శనికత, ఇంటిని చక్కబెట్కుకునే సగటు ఇల్లాలికి ఉండే ఇగురం ఈ మూడింటి మేలి కలయిక ఈ బడ్జెట్ ప్రతిపాదనలు
==================

ప్రణాళిక వ్యయం 67,630.73 కోట్లు
ప్రణాళికేతర వ్యయం 62,785.14 కోట్లు
రెవిన్యూ మిగులు 3,718 కోట్లు
ద్రవ్యలోటు 23,467 కోట్లు
రాష్ట్ర ఆదాయం 72,412 కోట్లు
కేంద్రం నుంచి గ్రాంట్లు 28,512 కోట్లు

ఆర్థిక మంత్రి ఈటల సోమవారం ఉదయం అనుకున్న ముహూర్తానికే రూ.1,30,415.87 కోట్లతో భారీ బడ్జెట్‌ను శాసన సభకు ప్రతిపాదించారు. ప్రణాళికేతర వ్యయాన్ని తక్కువ చూపించి, ప్రణాళికా వ్యయానికి పెద్ద పద్దు పెట్టడం బడ్జెట్ స్పెషల్‌గా ప్రకటించారు. సాగునీటి రంగానికి ఏకమొత్తంగా 25వేల కోట్లు కేటాయంచి తెరాస సర్కారు అబ్బురపర్చింది. తెలంగాణను కోటి ఎకరాల సాగు రాష్ట్రంగా చేయాలన్న సిఎం కెసిఆర్ సంకల్పాన్ని సాధించేందుకు మిషన్ కాకతీయకు భారీ మొత్తం కేటాయంచడం విశేషం. బంగారు తెలంగాణ సాధన కోసం సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికం, ఆరోగ్యం, ఇంధనం రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు మంత్రి ఈటల ప్రకటించారు. బడ్జెట్‌లో శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ, ఆకస్మికంగా వచ్చే అవసరాలకు ప్రత్యేకంగా నిధులు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక అభివృద్ధి నిధి పద్దు ఏర్పాటు చేయడం మరో స్పెషల్. ఈ ఖాతాలో రూ.4,675 కోట్లు చూపించారు. ముఖ్యమంత్రి మానస పుత్రికలైన మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్ళకు బడ్జెట్‌లో అసలు పద్దే లేకపోవడం విడ్డూరం. ఈ పథకాలకు నిధులను బ్యాంకు రుణాల ద్వారా సాధిస్తామని మంత్రి ఈటల ప్రకటించారు. ఇక ముందే అన్యాపదేశంగా ప్రకటిస్తూ వచ్చినట్టే.. జిల్లాల నిష్పత్తి ప్రకారం చూస్తే పొరుగు తెలుగు రాష్టమ్రైన ఆంధ్రకంటే -బడ్జెట్ బరువు కాస్త ఎక్కువేనన్న విషయాన్ని మంత్రి ఈటల చాకచక్యంగా చూపించడం గమనార్హం.

కీలక రంగాలకు కేటాయంపులు కోట్లలో

సాగు, గ్రామీణాభివృద్ధికి 8,676.08
ఇతర రంగాలకు 5,578.03
రవాణా రంగానికి 4711.82
సంక్షేమ రంగాలకు 23,473.47
ఇంధన రంగానికి 191.30
సాగునీటి రంగానికి 25 వేలు

ముఖ్యాంశాలు

బడ్జెట్ మూస పద్ధతులకు స్వస్తి
ప్రణాళికా వ్యయానికే పెద్ద మొత్తం
సాగునీటి రంగానికి 25 వేల కోట్లు
సంక్షేమ రంగానికి 13,412 కోట్లు
గ్రామీణాభివృద్ధికి 10,731 కోట్లు
వ్యవసాయరంగానికి 6,759 కోట్లు
ఆరోగ్యరంగానికి 5,967 కోట్లు
పట్టణాభివృద్ధికి 4,815 కోట్లు
ఆసరా పింఛన్లకు 4,693 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమ నిధికి 100 కోట్లు
రోడ్లు, భవనాలకు 3,790 కోట్లు
విద్యా రంగానికి 1,694 కోట్లు
ప్రణాళికేతర కింద 9,044 కోట్లు
భగీరథ, డబుల్ బెడ్‌రూమ్‌లకు కేటాయింపులు లేవు. హడ్కో, నాబార్డ్, ఎస్‌బిఐ, కెనరా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటామని వెల్లడి