క్రైమ్/లీగల్

లక్ష్యాన్ని అధిగమించిన ఆహార ధాన్యాల ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఆహార ధాన్యాల ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని అధిగమించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో 274.55 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా ఎంచుకున్నారు. వాతావరణం అనుకూలించడం, రైతులకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వంటి చర్యలతో ఈ ఉత్పత్తులు 284.83 మిలియన్ టన్నులకు చేరాయి. 2011-12 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ జరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తులను పరిశీలిస్తే, మధ్యలో కొంత తగ్గినప్పటికీ, మొ త్తం మీద పెరుగుదల కొనసాగుతున్నట్టు స్పష్టమవుతుంది. 2011-12 లో 259.29 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి 2012-13లో 257.13 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఆ ఏడాది కొంత తగ్గుదల కనిపించగా, మరుసటి ఆర్థిక సంవత్సరంలో పుంజుకొని, 265.04 మిలియన్ టన్నులకు చేరింది. 2014-15లో 252.02 మిలియన్ టన్నులు, 2015-16లో 251.57 మిలియన్ టన్నులు, 2016-17లో 275.11 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధ్యమైంది. గత ఆర్థిక సంవత్సరం మరింత మెరుగుపడి 284.83 మిలియన్ టన్నులకు చేరింది.