బిజినెస్

సాయం అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన ఆటో మొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి తక్షణ సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (్ఫడా) కోరింది. ఈ మహమ్మారి కారణంగా మొత్తం పరిశ్రమ కుదేలైందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు నిలిచిపోయాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాలపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా సుమారు 15,000 ఆటో డీలర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ‘్ఫడా’ కోరింది. అంతేగాక, వర్కింగ్ కేపిటల్ కింద నాలుగు శాతం వడ్డీకి రుణాలను ఇప్పంచాలని సూచించింది. కరోనా దెబ్బతో దారుణంగా నష్టపోయిన పరిశ్రమల జాబితాలో ఆటోమొబైల్ రంగం అగ్రస్థానంలో ఉందని, పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగంలో అన్ని రకాలైన రుణాలపై వడ్డీని ఎత్తివేయాలని, అదే విధంగా చెల్లింపులపై మారటోరియం విధించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసింది.