బిజినెస్

ఆగని పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో, లాక్ డౌన్‌ను కేంద్రం కనీసం మరో వారం రోజులు పొడిగిస్తుందన్న వార్తల నేపథ్యంలో, సోమవారం కూడా భారత స్టాక్ మార్కెట్లలో పతనం తప్పలేదు. కేంద్ర విధించిన లాక్ డౌన్ ఈనెల 14వ తేదీతో ముగుస్తుంది. అయితే, మరో వారం లేదా రెండు వారాలు కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణసహా పలు రాష్ట్రాలు ఈనెల 30వ తేదీ వరకూ లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో స్కైప్ ద్వారా సమావేశమైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డొన్ పొడిగింపువైపే మొగ్గుచూపారు. కోవిడ్ 19 కేసులు రోజురోజుకూ పెరగడం, లాక్ డౌన్ మరికొన్ని రోజులు పెరుగుతుందన్న వార్తలు రావడం సహజంగానే మార్కెట్లపై ప్రభావం చూపాయి. సోమవారం ఉదయం లావాదేవీలు ప్రారంభమైన తర్వాత ఎలాంటి సానుకూల ధోరణులు లేకపోవడంతో, మదుపరులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వారు ఆచితూచి వ్యవహరించడంతో, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 469.60 పాయింట్లు (1.51 శాతం) పతనమై 30,690.02 పాయింట్లకు చేరింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 118.05 పాయింట్లు (1.30 శాతం) నష్టపోయి 8,993.85 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 10 శాతం నష్టపోయింది. మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్ర తదితర కంపెనీల షేర్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. అయితే, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్‌టీపీసీ ప్రతికూల పరిస్థితులను అధిగమించి లాభాలను ఆర్జించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటాలు సగటున 31.2 శాతం తగ్గితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) వాటాల ధర 2.46 శాతం పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలు 3.44 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇలావుంటే, మాంద్య పరిస్థితుల నేపథ్యంలో రూపాయి మారకపు విలువ మరింతగా, 2.06 శాతం పతనమైంది. దీనితో డాలర్ విలువ 76.27 రూపాయలకు చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ దేశాలన్నీ మాంద్య పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఈవారం తదుపరి రోజుల్లో కూడా ఇదే తరహాలో అనిశ్చితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఎన్‌ఎస్‌ఈ భారీ విరాళం
కోవిడ్ 19 బాధితుల సహాయ నిధికి ఎన్‌ఎస్‌ఈ భారీ విరాళాన్ని ప్రకటించింది. 26 కోట్ల రూపాయలను ప్రధాని సహాయ నిధికి ఇస్తున్నట్టు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నట్టు ఎన్‌ఎస్‌ఈ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తిని నిరోధించే అవకాశం ఉంటుందని తెలిపింది. దేశంలో ఇప్పటి వరకూ 9,152 కేసులు నమోదుకాగా, మృతుల సంఖ్య 308కి చేరింది.