సాయిధరమ్‌తో గోపీచంద్ మలినేని చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జె.్భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవ్వనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.్భగవాన్-జె.పుల్లారావు మాట్లాడుతూ.. ‘‘టాలెంట్‌తో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకొన్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి గోపీచంద్ మలినేనిల కాంబినేషన్‌లో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త జోనర్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఇదివరకు సాయిధరమ్ చేయని కానె్సప్ట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. లేటెస్ట్ మ్యూజికల్ సెనే్షషన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చనున్నాడు. గీపీచంద్ ప్రస్తుతం మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు’’ అన్నారు.