వైఎస్ యాత్ర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓవైపు నందమూరి తారకరామారావు జీవిత కథతో ఎన్టీఆర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు బాలకృష్ణ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ పేరుతో రూపొందిస్తుంటే మరో రెండు సినిమాలు లైన్‌లోనే ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ కోసం రంగం సిద్ధం అవుతుంది. అయితే ఈసారి బయోపిక్ రూపొందిస్తున్నది ఎవరిపైనో తెలుసా.. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ లైఫ్ స్టోరీతో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నడు మహి వి రాఘవ్. లేటెస్ట్‌గా ఆనందోబ్రహ్మ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన వైఎస్ లైఫ్‌స్టోరీ తీయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడు. వైఎస్ పాత్రలోనటించేందుకు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని సంప్రదిస్తే ఆయన ఓకే చెప్పాడని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రానికి యాత్ర అనే టైటిల్ పెడుతున్నట్టు తెలిసింది. రాజశేఖరరెడ్డి జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిన పాదయాత్ర వల్లే ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగాడు. అందుకే ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్ పెడుతున్నారట. ఈ నెల చివరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.