సాహోరే..బాహుబలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టింది. రాజవౌళి దర్శకత్వ ప్రతిభకు యావత్ ప్రపంచం సలాం కొట్టింది. తాజాగా బాహుబలిలో సాహోరే బాహుబలి.. సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటేసి సంచలనం రేపింది. ఓ సాంగ్ ఈ రేంజ్‌లో వ్యూస్ సాధించడం నిజంగా పెద్దరికార్డ్ అని చెప్పాలి. సాహోరే.. అంటూ బాహుబలి వీరత్వాన్ని పొగుడుతూ కీరవాణి స్వరకల్పన చేసిన ఈ పాట ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరేట్ సాంగ్‌గా మారింది. లహరి మ్యూజిక్ ద్వారా 86 మిలియన్స్ ప్రేక్షకులు వీక్షించగా..దిల్ రాజు ఛానల్ ద్వారా 18 మిలియన్స్ మంది చూశారు. మొత్తంగా 100 మిలియన్ వ్యూస్‌తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ది గ్రేట్ బాహుబలి.