రాష్ట్రీయం

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పది రూపాయలకే భోజన పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 21: నిరుపేద రోగులు, వారి వెంట వచ్చే సహాయకుల సౌకర్యార్థం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పది రూపాయలకే భోజనం పథకం ప్రారంభించారు. టచ్‌స్టోన్ ఛారిటీస్, అక్షయపాత్ర ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఈ పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులకు 10రూపాయలకే భోజనం అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకుని, ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోందన్నారు. అక్షయపాత్ర పేరుతో పది రూపాయలకే అన్నం, పప్పు, సాంబారు అందిస్తారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, ఏరియా ఆసుపత్రుల్లో వౌలిక సౌకర్యాల కల్పనకు, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఈ నెల ఒకటో తేదీ నుండి ప్రారంభించిన అయిదు రకాల సేవలు మంచి ఫలితాలనిస్తున్నాయన్నారు. గర్భవతులను ఆసుపత్రులకు, బాలింతలను వారి ఇళ్లకు చేరవేసే ఉచిత 102 అంబులెన్స్, ఎక్స్‌రే సహా పలు రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడం, పది రూపాయలకే భోజన సౌకర్య కల్పన వంటి పథకాలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప భోజనం రుచి చూశారు. ఆయన వెంట జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకటబుద్ద, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ అలీం పాషా తదితరులున్నారు.