సంక్రాంతికి ‘కానిస్టేబుల్..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తన్నారు. సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ, ఓ కానిస్టేబుల్ తన నిజాయితీతో ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు? దాన్ని ఎలా అధిగమించాడనే కథనంతో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. నారాయణమూర్తి, జయసుధ కలిసి నటిస్తున్నారంటేనే సినిమాపై అంచనాలు పెరిగాయని, జనవరి మొదటివారంలో ఆడియోను, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.