జయదేవ్ టైటిల్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంటా రవి హీరోగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కె.అశోక్‌కుమార్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ఉగాది పర్వదినం సందర్భంగా ‘జయదేవ్’ అనే టైటిల్‌ని ప్రకటించారు. ఈ సందర్భంగా కె.అశోక్‌కుమార్ మాట్లాడుతూ ‘పవర్‌ఫుల్, పర్పస్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న చిత్రానికి ఉగాది పర్వదినాన ‘జయదేవ్’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశాము. డిసెంబర్ 9న షూటింగ్ స్టార్ట్‌చేశాం. హైదరాబాద్, మేడ్చల్, సిద్దాలగుట్ట టెంపుల్, కె.జి.రెడ్డి కాలేజ్, రామోజీ ఫిల్మ్‌సిటీ, మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి, తదితర ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా జరిగిన షూటింగ్‌తో 80 శాతం చిత్రం పూర్తవుతుంది. రెండున్నర పాటలు బ్యాలెన్స్ వున్నాయి. అందులో ఒక ఐటమ్‌సాంగ్‌ని హైదరాబాద్‌లో వేసే భారీ సెట్‌లో చిత్రీకరిస్తాం. మిగిలిన ఒకటిన్నర పాటలను ఏప్రిల్ 22నుంచి 29వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే షెడ్యూల్‌లో చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది’ అన్నారు.
జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ.. ‘ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కథ ఇది. కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని శాక్రిఫైస్ చేసే ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో రూపొందిన క్యారెక్టర్ జయదేవ్. అందర్నీ ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. దాదాపు పది యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయి. అన్నీ కథలో లింక్‌అయి వుంటాయి అన్నారు. గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెనె్నల కిషోర్, హరితేజ, శ్రావణ్, సుప్రీత్, కోమటి జయరామ్, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్, అరవింద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్, రచన: పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: కె.అశోక్‌కుమార్, దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ.