క్రైమ్/లీగల్

మ్యూజియం ప్రహరీ కూల్చివేత ఆదేశాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో అసమాన్‌ఘడ్ ప్రాంతంలో ఉన్న రైమండ్స్ సమాధి పరిరక్షణకు ఆర్కియాలజీ శాఖ నిర్మించిన ప్రహరీగోడను కూల్చివేయాలని సివిల్ కోర్డు ఆదేశాలను ధృవీకరిస్తూ సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్ట్ధుర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాధి వద్ద ఆర్కియాలజీ శాఖ నిర్మించిన ప్రహారీ గోడ నిర్మాణానికి సంబంధించి సరైన టైటిల్‌టీడ్‌కు సంబంధించి ఆధారాలను ఆర్కియాలజీ శాఖ ఇవ్వలేదని సింగిల్ జడ్జి కోర్టు గతంలో పేర్కొంది. దీంతో ఆర్కియాలజీ శాఖ హైకోర్టు ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ఈకేసును సావధానంగా వినాల్సి ఉందని, సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో ఆర్కియాలజీ శాఖ గోడ నిర్మాణాన్ని సవాలు చేస్తూ వి స్వరూపరాణి తదితరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.