రాష్ట్రీయం

అమరావతికి సంకల్పజ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 21: కేంద్ర రాజధాని ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన సందర్భంగా వెలిగించిన సంకల్పజ్యోతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అమరావతికి తరలించారు. అక్టోబర్ 22వ తేదీన శంకుస్థాపన జరిగిన కార్యక్రమానికి ముందు సంకల్పజ్యోతిని వెలిగించారు. రాజధాని నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు సంకల్పజ్యోతి వెలుగులు విరజిల్లాలనే సంకల్పంతో నిరంతరం కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. అప్పటి నుంచి సంకల్పజ్యోతి నిత్య ఆరాధానతో కొనసాగుతోంది. శనివారం ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు చేసి అమరావతిలోని శ్రీ అమరలింగేశ్వరస్వామి ఆలయానికి సంకల్పజ్యోతిని తరలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ అధికారి వి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం సంకల్పజ్యోతిని అమరావతి అలయం వద్ద మహాశివరాత్రి వరకు ఉంచుతామని అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతరం నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండపై వేంచేసి ఉన్న శ్రీ త్రికోటేశ్వరస్వామి అలయానికి సంప్రదాయబద్ధంగా తీసుకువెళతారు. తరువాత తెనాలిలోని వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం, పెదకాకాని శ్రీ మల్లికార్జున స్వామి అలయం వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా మసీదులు, చర్చిలలో కూడా ఉంచాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు.